వాట్సప్‌లో ఇకపై వాయిస్ మెసేజ్‌లకు ‘వ్యూ వన్స్’. త్వరలో ఈ ఫీచర్ కూడా...
WhatsApp: వ్యక్తిగత చాట్‌ల భద్రతలో భాగంగా ఇప్పటివరకు ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ ఇప్పుడు మరో ఫీచర్‌ని తీసుకొచ్చింది.
ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై వాయిస్ మెసేజ్‌లకు కూడా ‘వ్యూ వన్స్’ (View Once Voice Messages) సదుపాయాన్ని కల్పించనున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు కేవలం ఫొటోలు, వీడియోలకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్ ఇకపై వాయిస్ నోట్స్‌కు కూడా విస్తరించనుంది.
వాట్సప్ అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమైన ఫీచర్లతో ‘వ్యూ వన్స్’ కూడా ఒకటి. దీని సాయంతో మనం పంపించే ఫొటోలు, వీడియోలు ఒక సారి మాత్రమే వీక్షించే సదుపాయం ఉంటుంది. ఆ తరహా మెసేజ్‌లను సేవ్, షేర్ చేయటానికి వీలుండదు. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోవడం కూడా కుదరదు. అలాగే ‘వ్యూ వన్స్’ ఆప్షన్ సాయంతో పంపిన మెసేజ్‌లు 14 రోజుల్లోపు మాత్రమే చూసేందుకు వీలుంటుంది. తర్వాత ఆ మెసేజ్‌లు కనిపించవు. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను వాయిస్ నోట్ ఫార్మాట్‌కు సైతం వాట్సప్ జోడించింది. వాయిస్ రికార్డ్ చేసే సమయంలోనే ‘వ్యూ వన్స్’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చని వాట్సప్ తెలిపింది. గ్లోబల్‌గా లాంచ్ చేసిన ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
స్టేటస్‌లో హెచ్‌డీ ఫొటో, వీడియోలు:
క్వాలిటీ ఫొటోలు, వీడియో షేరింగ్ విషయంలో ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెడుతూ హెచ్‌డీ (HD) ఫొటోలు, వీడియోలు పంపించే సదుపాయాన్ని వాట్సప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సదుపాయాన్ని విస్తరించాలని చూస్తోంది. ప్రస్తుతం స్టేటస్ పెట్టే ఫొటోల క్వాలిటీ దెబ్బతింటోంది. దీంతో స్టేటస్‌లో పెట్టే ఫొటోలు, వీడియోలకు కూడా హెచ్‌డీ క్వాలిటీ సదుపాయం తీసుకురావాలని వాట్సప్ చూస్తోంది. వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని తెలిపింది. మొదట బీటా యూజర్లకు అందుబాటులోకి రానుంది.
0 Comments