జనగణమన స్వీకరణ దినోత్సవం నేడు (1950 జనవరి 24)
భారత జాతీయ గీతంగా 1911లో రవీంద్రనాధ్ ఠాగూర్ రచించి, మొదటి సారి పాడిన గీతం జనగణమన... 1950 జనవరి 24న రాజ్యాంగ సభ స్వీకరిం చిన రోజు. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. భారత జాతీయగీతం సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీ య కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు. 1912 జనవరి లో ఈ గీతా న్ని “తత్వ భోదిని” అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది. 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ముందుగా ఠాగూర్ సృష్టించారు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది. జాతీయోద్యమం నేపథ్యంలో ఆ గీతాన్ని అనేకసార్లు, అనేక వేదికల మీద ఆలపిం చారు. అయితే ఇప్పుడు మనం వినే ట్యూన్ కాకుండా, నిర్ధిష్టమైన స్వర కల్పన లేకుండా, ఎవరికి నచ్చిన రాగంలో వాళ్లు పాడుకునే వారు. జనగణమనకు ఆహా స్వరాన్ని కట్టింది ఒక ఐరిష్ జాతీయురాలైతే... దానికి వేదికైంది చిత్తూరు జిల్లా మదనపల్లె . భారత స్వాతంత్రోద్యమాన్ని బలపరిచిన డాక్టర్ అనీబిసెంట్ మదనపల్లెలో థియోసాఫికల్ కాలేజీని స్థాపించారు. ఐరిష్ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ దాని ప్రిన్సిపాల్గా ఉండేవారు. లండన్ మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు. 1919లో దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్న రవీంద్ర నాధ్ ఠాగూర్ ఒకరోజు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నపుడే ఆయనను మదనపల్లె వాతావరణం, జేమ్స్ కజిన్స్ క విత్వం ఆకట్టుకుంది. మదనపల్లి అంటే చాలా ఇష్టమైన ఠాగూర్, కజిన్స్ అక్కడే ఉన్న విషయం తెలుసుకుని, ఆయన విశ్రాంతి కోసం మదనపల్లెలోని థియోసాఫికల్ కాలేజీ చేరుకున్నారు. ఠాగూర్ కు ప్రశాంత వాతావరణం కలిగిన థియోసాఫికల్ కాలేజీ లో ప్రతి బుధవారం భోజనాల తర్వాత విద్యార్థులంతా కలిసి పాటలు పాడేవాళ్లు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఠాగూర్, ఒక కార్యక్రమంలో పాల్గొని, ఆ సందర్భంగా ఆయన స్వయంగా తన గొంతుకతో జనగణమన ఆలపించారు. ఠాగూర్ కంఠస్వరం నుంచి వెలువడిన ఆ పాటకు విద్యార్థులంతా గొంతు కలిపారు. మార్గరేట్ కజిన్స్ కూడా ఆ సమయంలో అక్కడే ఉండి, పాటలోని దేశభక్తిని, జాతీయ భావాన్ని గమనించారు. కానీ అప్పటికి జనగణమనను ఎవరికి వారే తోచిన రీతిలో పాడు కునే వారు. ఎవరూ రాగయుక్తంగా పాడ లేదు. కనుక దానిని తానే స్వరబద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారి ఆమె ఠాగూర్ను కలిసి జనగణమన ను స్వరబద్ధం చేయాలన్న తన కోరికను వెలిబుచ్చారు. దీనికి అంగీకరించిన ఠాగూర్, ఆమెకు ఆ పాట అర్థాన్ని వివరించారు. దానికి స్వరం ఎలా ఉంటే బాగుం టుందో సూచించారు. తర్వాత మార్గరేట్ కజిన్స్ తన విద్యార్థినుల సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ దానికి. బాణీ సమకూర్చారు. తర్వాత ఠాగూ ర్కు తాను కట్టిన స్వరాన్ని వినిపించారు. కొన్ని చిన్న చిన్న సంగీత పరికరాలతో విద్యార్థులు రాగయుక్తంగా పాడిన జనగణమన గీతాన్ని విన్న ఠాగూర్ ఆమెను ఎంతగానో అభినందించారు. బెంగాల్లో పుట్టిన జనగణమన గీతం మదనపల్లె లో స్వరాన్ని సమకూర్చు కున్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలో ఉన్న సమయంలోనే ఒక ఉదయాన థియోసాఫికల్ కాలేజీ ప్రాంగణంలోని చెట్టు కింద కూర్చుని జనగణమనను ఆంగ్లంలోకి అనువ దించారు కూడా. ఆ తర్వాత దానిని తన అందమైన చేతిరాతతో రాయడమే కాకుండా, కింది భాగంలోదానిపేరు 'మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' అని రాశా రు. జనగణమన పాడినప్పుడు దాని అర్థాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. దాని నేపథ్యాన్ని, అర్థాన్ని, ప్రాధాన్యతను గుర్తించి, తర్వాత తరం వారికి చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
0 Comments