GET MORE DETAILS

ఈ సమస్యలున్న వారు టమాటాలు ఎక్కువగా తినకూడదు. బీ కేర్ ఫుల్...

ఈ సమస్యలున్న వారు టమాటాలు ఎక్కువగా తినకూడదు. బీ కేర్ ఫుల్...



టమాటాలు లేకుండా ఏ వంటకం కూడా పూర్తి కాదు. టమాటా మన ఆహారానికి మంచి రుచిని జోడిస్తుంది. దీనికి తోడు అన్ని సీజన్లలోనూ ఇవి మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. టమాటాల్లో ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఏదైనా అతిగా తీసుకుంటే అనర్థమే. టమాటాల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. కొందరు తమ ఆహారంలో టమాటాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ఎన్ని ప్రయోజనాలున్నా, రుచిగా ఉన్నా టమాటాలు ఎక్కువగా తినడం ప్రమాదకరం. ముఖ్యంగా ఈ కింది అనారోగ్య సమస్యలున్న వారు టమాటాలు ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కీళ్ల నొప్పుల సమస్య:

టమాటాల్లో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది మీ కీళ్లలో వాపు, నొప్పిని కలిగిస్తుంది. టమాటాలు మన కణాలలో కాల్షియం ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది. అయితే ఎక్కువగా తీసుకుంటే ఇది వాపుకు దారి తీస్తుంది. నిలబడటం, కూర్చోవడం, ఒక్కోసారి నడవడం కూడా కష్టంగా మారుతుంది.

మూత్రపిండాల్లో రాళ్లు:

టమాటాల్లో కాల్షియం ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు టమాటాలకు దూరంగా ఉండాలని ఆయుర్వేదం నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కోసారి మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. టమాటాల్లో ఆమ్ల స్వభావం ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. టమాటాలు అధికంగా తింటే గుండెల్లో మంట, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అధిక అసిడిటీ సమస్య ఉన్నవారు టమాటాలు మితంగా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

అలర్జీ సమస్యలు:

టమాటాలో హిస్టామిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో అలర్జీల సమస్యలను కలిగిస్తుంది. టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతులో చికాకు, తుమ్ములు, తామర, నాలుక, ముఖం, నోటి వాపు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మీకు ఇప్పటికే ఈ సమస్యలన్నీ ఉంటే, మీ ఆహా రంలో టమటాల వినియోగాన్ని తగ్గించడం మేలని నిపుణులు చెపుతున్నారు.

Post a Comment

0 Comments