అరోగ్యమస్తు - మీ ఆరోగ్యం మీ చేతుల్లో : వాముతో లాభాలు
✅ అన్నప్రాశన తర్వాత క్రమేణా అన్నంలోకి తీసుకువచ్చేందుకు పాపాయిలకు మొదటగా మనం తినిపించేది వాము కలిపిన అన్నమే! అంటే, మనిషి మొదటగా భుజించిన ఆహారపదార్ధం 'వాము' అన్నమాట!
✅ జీర్ణాశయాన్ని తనగుప్పెట్లో పెట్టుకొని లోపల స్రవించే స్రావాలను సక్రమంగా వింపచేసి జఠరాగ్నిని రగిల్చి, తీసుకున్న ఆహారం పక్వమై, అరిగి వంటబట్టేలా చేసేందుకు వాము పూచీ పుచ్చుకుంటుంది.
✅ ఒక్క మాటలో చెప్పాలంటే, కొలిమి ముందు గాలితిత్తిలా పనిచేస్తుంది వాము. గాలితిత్తిని ఉపయోగించే కొద్దీ కొలిమిలో అగ్ని రగుల్తుంది. వాముని సద్వినియోగం చేసుకున్నాం. అంటే కడుపులో జఠరాగ్ని పదిలంగా వుంటుంది.
అజీర్తి - అరుచీ అరాచకాల ఆటకట్టించే వాము
1. అజీర్తినీ, అజీర్తి వలన వచ్చే వివిధ కష్టాల్ని గట్టెక్కించడానికి వాము చేసే కృషి అమోఘం. అరుచి నోరురుచి తెలియకుండా పోవడం, అన్నహితవు లేకపోవడం వంటి లక్షణాలను కుదర్చడానికి పెట్టింది పేరు వాము.
2. వాము పొడిలో తగినంత సైంధవలవణం కలిపి రోజూ అన్నంలో మొదటి ముద్దలో ఒక చెంచా పొడిని కలుపుకొని తింటే ఆకలి పరుగులు తీస్తూవస్తుంది. అన్నహితపు లేకపోవడం, నోరు రుచి తెలియకపోవడం, నాలుక జిగురుగా వుండడం... ఇవన్నీ ఈ చికిత్సతో తగ్గుతాయి. వేయించిన వాముపొడి అన్నంలో వేసుకు తింటే పసిపిల్లలకు అన్నం పెట్టినట్టుందని అనుకొంటున్నారా. మీది మరీ స్థూల కాయం కాకుండా వుంటే నెయ్యి వేసుకుని మరీ తినండి. 'అగ్ని'ని పెంచాలంటే 'ఆజ్యం' వుండాలి కదా!
3. వాముపొడిని రోజూ తీసుకుంటే, కడుపులో బరువుగా వుండటం తగ్గి శరీరం తేలికగా వుంటుంది.
4. పసిబిడ్డల ఆహారంలో వాముపొడి కలిపి పెట్టాలి. ఎందుకంటే, రానీకుండా తేలికగా అరిగేలా మేలుజేస్తుంది కాబట్టి!
5. పెరుగుతున్న పిల్లలకు రోజూ వాముపొడి పెడితే కడుపులో పాములు చచ్చిపడి పోతాయి. కొత్తవి పెరగవు.
6. కడుపు ఉబ్బరం, కడుపులో వాతం తగ్గాలంటే వాము పొడిని నేరుగా తేనె కలుపు కొనిగానీ, అన్నంలో కలుపుకొని గానీ తింటే తక్షణం ఫలితం కన్పిస్తుంది.
7. పేగుపూత, వలనగానీ కడుపులో మంట వలన గానీ, అజీర్తి వలనగాని కడుపులో ఇతర కారణాల వలనగానీ వచ్చే కడుపునొప్పికి వాము పొడిగానీ, వా కషాయాన్ని గానీ తీసుకుంటే నొప్పి ఉపశమనం ఇస్తుంది.
8. లివర్లోగానీ, పేగుల్లోగానీ కడుపులో ఇతర అవయవాలలోగానీ వచ్చే గడ్డల్ని కరిగించడానికి వాము ఎంతగానో సాయపడ్తుంది.
9. పేగుపూతని తగ్గించడానికి, పుండుమాడేలా చేయడానికి వాము ఔషధంలా ఉపయోగపడ్తుంది. క్రమం తప్పకుండా వాడితే ఫలితాలు కనిపిస్తాయి.
10. విరేచనాలు, కలరా, ఎంటరైటిస్ వంటి వ్యాధుల్లో వాముని ఏదో ఒక రూపంలో తీసుకోగలిగితే విరేచనాలను తగ్గించడానికి వాము సహకరిస్తుంది. వాము కషాయంఅయితే మంచిది.
11. ఇది విరేచనాలను తగ్గిస్తుందికానీ, మలబద్ధకాన్నీ కల్గించదు. అందువలన రోజూ విరేచనం సాఫీగాకాక అవస్థపడేవారు కూడా వాము కషాయాన్ని కొన్నాళ్ళపాటు * తాగితే విరేచనం సాఫీగా జారీ అయి, ఫ్రీగా వెళ్ళడం అనేది ఒక అలవాటు అవుతుంది.
12. వాము + మిరియాల్ని వేర్వేరుగా వేయించి, కలిపి కొద్దిగా నీళ్ళుపోసి నూరి, వడపోసి, పిల్లలకు తాగిస్తే అజీర్తి, అజీర్ణ విరేచనాలు, చంటి బిడ్డల్లో కడుపు ఉబ్బరం, విరేచనం వాసనగా, ఆకుపచ్చగా వెళ్ళడం వంటి లక్షణాలు తగ్గుతాయి.
13. వామూ లవంగాల్ని వేయించి ఇలానే ఇస్తే కడుపు బిగపట్టడం, కడుపులో వికారాలు కడుపులో విషదోషాలు, అతిగా త్రేన్పులు రావడం తగ్గుతాయి.
14. పేగులు, లివర్, స్క్రీన్ మూత్రపిండాలు, గర్భసంచి మూత్రపు సంచి ఉదరంలో వయవాలకు సంబంధించి ఏ జబ్బు వచ్చినా నిరభ్యంతరంగా వాముని ఏదో ఒక రూపంలో తీసుకోవడం అవసరం. ఉదర వ్యాధుల్లో వాము అన్ని సందర్భాల్లోనూ పధ్యం. అంటే తప్పనిసరిగా తీసుకోవాలన్న మాట.
15. వాము, మిరియాలు, ఉప్పు (తగినంత) ఈ మూడింటినీ కలిపి నూరి తేనెతోగానీ, పేరు నెయ్యితోగానీ, వెన్నపూసతోగాని తీసుకుంటే అజీర్తి, కడుపునొప్పి తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది.
16. వాము అందరికీ మేలు చేసేదేగాని, వేడిచేసే శరీరతత్వం వున్న వారికి మాత్రం పరిమితి దాటి తీసుకుంటే కొద్దిగా వేడిచేయడం. తలనొప్పి పుట్టించడం చేస్తుంది. వేడిచేసే వారి కళ్ళకు ఇది మంచిది కాదు పైత్యం చేసినట్లనిపిస్తుంది. అందుకని జాగ్రత్తగా వుండాలి. వాముతో చనుపాలనుగానీ, కొత్తిమీరరసాన్నిగానీ, తీసుకుంటే వాముకు విరుగుడుగా పనిచేస్తాయని వస్తు గుణదీపిక హామీ ఇస్తోంది. వేడిచేయని వారికి కళ్లజబ్బుల్లో కూడా వాము సహాయకారిగా వుంటుంది.
17. "వాము పువ్వు" అంట వాములోంచి తీసిన సారం. దీని "థైమాల్" అంటారు. ఇది కొంచెం కారంగా వుంటుంది. బాగా వేడిచేస్తుంది. ఒంట్లో వేడి పుట్టిస్తుంది. పరిమితంగా, చాలా స్వల్ప ప్రమాణంలో తీసుకొంటే కడుపులో అగ్నిని రగిల్చి ఆకలి పుట్టిస్తుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. అజీర్తి విరేచనాన్ని తగ్గిస్తుంది. వాముకున్న గుణాలన్నీ దీనికి అత్యంత శక్తివంతంగా వున్నాయి. కానీ, ఇది తీక్షణంగా పనిచేస్తది వాము సున్నితంగా పనిచేస్తుంది.
మూత్రాశయం, గర్భాశయ ఈ రెండింటిపైనా వాము ప్రభావం గణనీయమైంది. ముఖ్యంగా స్త్రీల వ్యాధుల్లో దీని ప్రభావం ఎక్కువ.
0 Comments