మన ఆరోగ్యం మన చేతుల్లో - వీటి విలువ తెలుసుకోవడం చాలా ముఖ్యం
ఆఫీసుకి వెళ్లే హడావుడిలో పెద్దలకు, స్కూల్ కి వెళ్లే హడావుడిలో పిల్లలకు తగిన పోషకాహారాలు తీసుకోలేకపోతున్నారు. రోజూ తినే ఆహారంతో పాటు ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువున్న ఆహారపదార్ధాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఆ పోషకాలు వేటిలో లభిస్తాయో, వాటివలన లాభాలేమిటో తెలుసుకుందామా...
ఫిగ్స్ :
ఉల్లి ఆకారంలో పచ్చగా లోపల యర్రని గింజలతో ఉండే ఫిగ్స్ ఇప్పుడు అన్ని చోట్లా దొరుకు తున్నాయి. తాజా ఫిగ్స్లో పొటాషియం ఎక్కువ శాతం లభిస్తుంది. హై, లో బ్లెడ్ ప్రెషర్నించి కాపాడుతుంది. బరువును పెరగకుండా చూసే ఫిబ్రాను కూడా ఇది కలిగి వుంటుంది.
బ్లూ బెర్రీస్ :
గుండెకు, మెదడుకు ఎంతో శక్తినిచ్చేవి క్రాన్ బెర్రీస్, బిల్బెర్రీస్, బ్లూబెర్రీస్. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ 'సి', 'ఇ' పుష్కలంగా వుంటాయి బ్లూబెర్రీస్లో. వీటివల్ల మెదడు చురుగ్గా పని చేయడమే కాదు వార్ధక్యంలో వచ్చే ఎన్నో వ్యాధులు కూడా నయం అవుతాయి.
తేనె :
చక్కెరకు బదులుగా ఏ పదార్థంలోనైనా తేనె వాడుకోవచ్చు. సత్వర శక్తినిచ్చే సాధనంగా తేనె బాగా పనికొస్తుంది. దీనిలోని కాల్షియం ఎముకలకు, గుండెకు కూడా బలాన్నిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడటానికి కూడా తేనె అవసరం.
దానిమ్మ :
దీనిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్ టీలోకంటే అధికంగా పోలీఫెనాల్స్, టానీస్, ఏనో థోక్సిన్స్ ఇందులో ఉంటాయి. యాంటీఏజంట్లుగా కేన్సర్ కణాలతో పోరాడే శక్తిని ఇవ్వడంలో ఇవి ముందుంటాయి.
ఆలివ్ ఆయిల్ :
ఓలిక్ యాసిడ్తో నిండి ఉండే ఆలివ్ ఆయిల్లో రక్తానికి అవసరమైన ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ లభి స్తుంది. రక్తంలోని చక్కెర శాతాన్ని కంట్రోల్ చేయ డంలోనూ, కేన్సర్ ముఖ్యంగా రొమ్ము కేన్సర్ బారినుండి కాపాడుతుంది.
సోయాబీన్స్ :
పొట్రీన్లకు మారుపేరు సోయాబీన్ అని వేరే చెప్పక్కర్లేదు. గుండె సంబంధ వ్యాధులనుంచి రక్షణకు ఎంతో ఉపయుక్తం. ఫైబర్, పొటాషియమ్లు మెండుగా వున్న సోయాబీన్స్ రోజువారీ భోజనంలో తప్పక తీసుకోవాలి.
పెరుగు :
ప్రొటీన్, కాల్షియమ్, రిబోప్లేవిన్, విటమిన్ 'బి 12'తో కూడిన పెరుగు శరీరానికి సాత్విక ఆహారంగా పని చేస్తూ సహజ జీర్ణశక్తిని పెంచేందుకు సహకరిస్తుంది.
0 Comments