వీటితో స్పెర్మ్ కౌంట్ పెంచుకోండి
ఇండియాలో అధికారిక IVF కేంద్రాలు, స్పెర్మ్ బ్యాంక్ల ద్వార స్త్రీలు అండం, పురుషులు స్పెర్మ్ దానం చేయడం, అమ్ముకోవడం లీగల్. ప్రస్తుతం భారత్ లో పురుషులు స్పెరు రూ.8000-12000, స్త్రీల అండానిరూ. 25000-30000 చెల్లిస్తున్నారు.
వీటితో పాటు రోజు వ్యాయామం కూడా చేస్తే వెంటనే చక్కటి ఫలితాలు చూడవచ్చు.
వీర్యంలో శుక్రకణాల సంఖ్య పెంచుకోవాలంటే మీ రోజువారి ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి. అప్పుడు కృత్రిమ గర్భధారణ కోసం IVF సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అంటున్నారు నిపుణులు.
గుడ్లు:
వీటిలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ దాడి నుంచి వీర్యాన్ని కాపాడటానికి గుడ్లు సహాయపడతాయి. వీర్యకణాలు చురుకుగా కదలడానికి కూడా గుడ్డు ఉపయోగపడుతుంది.
పాలకూర:
ఇందులో ఫోలిక్ యాసిడ్ మెండుగా ఉంటాయి. ఇది వీర్య కణాలకయ్యే డ్యామేజ్ రిపేర్ చేస్తుంది. కొత్త స్పెర్మ్ అభివృద్ది చేస్తుంది.
గుమ్మడి గింజలు:
వీటిలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెంచుతాయి. వీటిలోని ఒమేగా-3 ఆమ్లాలు రక్త ప్రసరణ మెరుగుపరచడంతో పాటు స్పెర్మ్ నాణ్యతని పెంచుతాయి.
జింక్ పదార్థాలు:
బార్లీ, చిక్కుళ్లు, మాంసం వంటి జింక్ ఎక్కువ ఉండే పదార్థాలు వీర్య కాణాలు సంఖ్య వృద్ధి చెందడానికి దోహదపడతాయి. జింక్ లోపంతో వీర్యకణాలు కదలికలు తగ్గుతాయి.
దానిమ్మ:
వీర్యకణాల సంఖ్య, వీర్య నాణ్యతను వృద్ధి చేస్తుంది. దానిమ్మగింజల్లోని యాంటీఆక్సిడెంట్స్ కణాలను పాడుచేసే ఫ్రీరాడికల్స్ను అడ్డుకుంటాయి.
టమాటా:
వీటిల్లో విటమిన్-Cతో పాటు లైకోపేన్ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది పురుషుల్లో సంతాన సామర్థ్యం పెంచడానికి ఉపయోగపడుతుంది.
డార్క్ చాక్లెట్:
L-ఆర్జినిన్ HCL అనే అమైనో ఆమ్లం డార్క్ చాక్లెట్లో ఉంటుంది. ఇది వీర్య మోతాదు, వీర్యకణాల సంఖ్యను వృద్ధి చేయడానికి సహకరిస్తుంది.
అరటిపండ్లు:
ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉత్పత్తి కావడానికి తోడ్పడే విటమిన్-A, విటమిన్ B1, విటమిన్-C అరటిపండ్లలో ఉంటాయి. వీటిల్లో బ్రోమిలైన్ అనే అరుదైన ఎంజైమ్ ఉంటుంది. ఇది వాపును అడ్డుకోవడం, వీర్యనాణ్యతతో పాటు వాటి సంఖ్యను పెంచుతుంది.
వాల్నట్స్:
వీర్యకణాల మీద ఉండే కణజాల పొర ఉత్పత్తికి మంచి కొవ్వు అవసరం. వాల్నట్స్లో ఉండే ఓమెగా-3 ఇందుకు సహకరిస్తుంది. ఇవి వృషణాలకు రక్తప్రసరణ పెంచుతాయి.
0 Comments