GET MORE DETAILS

పాదాలకు వ్యాయామంతో ఆరోగ్యం

 పాదాలకు వ్యాయామంతో ఆరోగ్యం* నువ్వుల నూనెతో రోజూ పాదాలను 5-10 నిమిషాల పాటు మర్దనా చేయాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కాపడం పెట్టాలి. ఇలా రోజూ చేస్తే పాదాలలో రక్త సరఫరా పెరుగుతుంది. వాపులు తగ్గుతాయి.


* అలాగే నిద్రించేటప్పుడు పాదాలను ఎత్తులో పెట్టుకుని నిద్రించాలి. అందుకు గాను దిండును ఉపయోగించాలి. పాదాలు గుండె కన్నా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.


* ఇక ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. ఉప్పును తగ్గించాలి. ఎక్కువ సేపు కూర్చుని ఉండరాదు. మధ్య మధ్యలో విరామం తీసుకుని కాస్తంత దూరం నడవాలి.


* రక్త సరఫరా మెరుగు పడేందుకు పాదాలకు వ్యాయామం చేయాలి. దీంతో వాపులు, నొప్పులు తగ్గుతాయి.

Post a Comment

0 Comments