గ్యాస్ సమస్యకు చెక్
కొబ్బరి నీళ్లు : గ్యాస్ సమస్యను తీర్చేందుకు కొబ్బరి నీళ్లు మంచి మందు. ఇందులో అసాధారణ ప్రోటీన్లు ఉంటాయి. రోజూ కొబ్బరి నీళ్లను తాగడం చేసుకుంటే మంచిది. అలవాటు.
కొత్తిమీర : అజీర్తి నిర్మూలనకు కొత్తిమీర బాగా పని చేస్తుంది. కడుపులో మంటగా ఉన్నప్పుడు కొత్తిమీర తీసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఒక గ్లాస్ మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
నిమ్మ రసం : గ్యాస్ సమస్యకు తాత్కాలిక ఉపశమ నానికి నిమ్మ రసం ఎంతో మేలు. ఒక కప్పు ఉప్పులో నిమ్మరసం, అరస్పూన్ బేకింగ్ సోడా కలిపి తాగాలి. ఈ రసాన్ని ఉదయానే తీసుకుంటే చాలా మంచిది.
అల్లం : గ్యాస్ సమస్యకు మంచి మందు అల్లం. దీనిని చిన్న ముక్కగా చేసి రోజూ భోజనానికి ముందు నమిలి తీసుకుంటే చాలా మంచిది. తిన్నగా నమలలేకపోతే చక్కెర కలుపుకుని తినొచ్చు.
వెల్లుల్లి : గ్యాస్ సమస్యకు వెల్లుల్లి చాలా చక్కటి సహజసిద్ధమైన మందు. దీనిని తిన్నగా నమిలాలి. లేదా వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర విత్తనాలు, జీలకర్ర గింజలు తీసుకుని ఐదు నిమిషాలపాట నీళ్లలో ఉడికించాలి. ఈ ద్రావణాన్ని తాగితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
దాల్చిన చెక్క : దాల్చిన చెక్కను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఆ జ్యూస్ ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య పోతుంది.
నల్ల మిరియాలు : మిరియాలను పాలలో కలిపి తాగితే గ్యాస్ద.
ఇంగువ : ఒక గ్లాస్ లో వేడినీటిని తీసుకుని, అందులో ఇంగువ వేసుకుని బాగా కలిపి తాగాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్య, కడుపు నొప్పి, అజీర్థి తగ్గిపోతాయి.
0 Comments