GET MORE DETAILS

అది ముదిరితే కీళ్లవాతమే...

 అది ముదిరితే కీళ్లవాతమే...



ఇతర కీళ్ల నొప్పులు శరీరంలో ఏదో ఒక వైపు కీలుకు వాపు, నొప్పి ఉంటుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఒకేసారి రెండు వైపులా వాపు కనిపిస్తుంది.

మన శరీరం అంతా ఎముకలు వాటి పై కండరాలతో నిర్మితమై ఉంది. శరీరానికి మొదటి ఆధారం ఎముకలే. ఇలాంటి ఎముకలకు వచ్చే ఆరోగ్య సమస్యే అర్థరైటిస్. అంటే కీళ్ళలో మంట, నొప్పితో కూడిన వాపులు. ఇది 170 రకాల కీళ్ల జబ్బులు. దీని వల్ల కీళ్లలో నొప్పి, వాపు, నరాలు బిగుసుకు పోవడం ఈ వ్యాధి లక్షణాలు. దీన్ని కీళ్లవాతం అని కూడా అంటారు. కొన్ని ప్రత్యేక అనారోగ్య సమస్యల కారణంగా ఆర్థరైటీస్ వస్తుంది. అలా అర్థరైటిస్ లో చాలా రకాలు కలవు. కానీ ఏ కారణం లేకుండా వచ్చేదే రుమటాఇడ్ ఆర్థరైటిస్.

ఇది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. కుడి, ఎడమ రెండు ప్రక్కల నొప్పి, వాపు, మంట లక్షణాలు కనిపిస్తుంటాయి. దీన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకువచ్చే.. అత్యాధునిక చికిత్సా విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం రేపు ప్రపంచ అర్థరైటిస్ డే గా జరుపుతారు.

Post a Comment

0 Comments