GET MORE DETAILS

13-02-2024 / మంగళవారం / రాశి ఫలితాలు

 13-02-2024 / మంగళవారం / రాశి ఫలితాలు



మేషం:

స్ధిరాస్తి   ఒప్పందాలలో  పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి.  వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న పాటి వివాదాలు ఉంటాయి.

---------------------------------------

వృషభం:

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా  వ్యవహరించాలి. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

---------------------------------------

మిధునం:

గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత  పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

---------------------------------------

కర్కాటకం:

చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు.  చేపట్టిన పనులలో  నూతన ప్రణాళికలు అమలుపరచి  సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి.

---------------------------------------

సింహం:

భూ సంబంధిత వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ  సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. గృహమున  కొందరి ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బందికి గురవుతారు.

---------------------------------------

కన్య:

దైవ సేవా కార్యాక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.  నూతన వ్యాపారాలు  ప్రారంభించిన  ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

---------------------------------------

తుల:

నూతన వస్తు వాహనాలు  కొనుగోలు చేస్తారు.  మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చేవిధంగా ఉండవు. వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నలాలో అవరోధాలు తొలగుతాయి.  వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి.

---------------------------------------

వృశ్చికం:

శత్రు సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.  బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

---------------------------------------

ధనస్సు:

గృహమున కొన్ని సంఘటనలు  ఆశ్చర్యం కలిగిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి.

---------------------------------------

మకరం:

నిరుద్యోగులకు చాలాకాలంగా వేచి చూస్తున్న అవకాశములు అందుతాయి. ఉద్యోగమున పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

కుంభం:

సన్నిహితుల నుండి అందిన ఒక వార్త  ఉత్సాహం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికీ అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన  కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టే పనులను  ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు.

---------------------------------------

మీనం:

కుటుంబ వ్యవహారాలలో  కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన పనులలో  శ్రమ మరింత అధికం అవుతుంది. ఉద్యోగ విషయమై  అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణ భారం అధికమౌతుంది. బంధు మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

Post a Comment

0 Comments