GET MORE DETAILS

 జిడ్డు తొలిగేలా..


ఇంట్లో వంట చేసేటప్పుడు పాత్రలను పట్టుకోవడానికీ, స్టాని శుభ్రం చేయడానికీ వస్త్రాన్ని ఉపయోగిస్తాం. కొన్నిరోజులకి ఇది జిగటగా మారి పట్టుకోవాలంటే చికాకుగా ఉంటుంది. ఆ జిడ్డు మరకలను వదిలించాలంటే ఈ చిట్కాలను పాటించి చూడండి.


* ఒక పాత్రలో నీరు పోసి అందులో కాస్త డిటర్జెంట్, నిమ్మరసం వేసి కిచెన్ క్లాత్ను ఐదు నిమిషాలుంచి మరిగించాలి. చల్లారిన తర్వాత శుభ్రం చేస్తే ఎటువంటి మరకలున్నా వదిలిపోతాయి.


* పాత్రలో వేడి నీటిని పోసి అందులో చెంచా బేకింగ్ సోడా, కాస్త డిటర్జెంట్ కలపాలి. వంటగది వస్త్రాన్ని ఇందులో నానబెట్టి చల్లారాక బ్రష్తో రుద్దితే మురికి వదులుతుంది.


* ఈ మసిబట్టపై నల్లని మరకలు ఏర్పడినప్పుడు వదిలించడానికి గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా, వైట్ వెనిగర్, డిటర్జెంట్ వేసి, అరగంట నానబెట్టాలి. ఆపై బ్రష్తో వాష్చస్తే సరి. వారానికోసారి చేస్తే శుభ్రంగా ఉంటాయి.

Post a Comment

0 Comments