GET MORE DETAILS

తరవాణిచారు - లక్ష్మి చారు - కలికుండ ఆరోగ్య రహ్యసం తరువాణి, వంటింట్లో కలికుండ అన్నపూర్ణ

తరవాణిచారు - లక్ష్మి చారు - కలికుండ ఆరోగ్య రహ్యసం తరువాణి, వంటింట్లో కలికుండ అన్నపూర్ణ



బియ్యం  రెండోసారి కడిగిన తరువాత  ఆ వాటర్  ,అన్నం వార్చిన గంజి  మరియు వండిన అన్నం  లో  తొలి గా  తీసిన కప్పు అన్నం  రెడీ చేసుకుని  కొత్త కుండ ని  శుభ్రం  గా కడిగి  పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి  దానిలో ముందుగా రెడీ చేసుకున్న  బియ్యం కడుగు అన్నం గంజి ని  కుండలో వేసి  పసుపు నీటి లో  ముంచిన గుడ్డ ను  కట్టి మైలు గాలి  తగల కుండా కిచెన్  లో  ఒక మూల గా  భద్ర పరచాలి ఇది  ఒక్క లక్ష్మి వారం మాత్రమే చేయాలి  దీన్ని మళ్లీ  ఆదివారం గుడ్డ తొలగించి  ఆ వాటర్  ఫుల్ గా  తీసివేసి మరలా  sameఅలాగే తయారు చేసి  కుండ లో  వేసి మళ్లీ పసుపు గుడ్డ కట్టే యాలి ఇలా రెండు సార్లు  చేసి తరువాత నుంచి  ఆ  వాటర్ తో (సాంబార్ )లా. అన్ని కాయగూరలు ముక్కలు మామిడి ముక్కలు తరిగి కొద్దిగా  చింతపండు  పసుపు ఉప్పు కారం కరివేపాకు తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి స్టవ్ మీద గిన్నె లో పెట్టి  బాగా మరిగించి పోపు పెట్టుకోవాలి  దీనిని తరవాణి  లేదా లక్ష్మీ చారు అంటారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది  చలువ చేస్తుంది విటమిన్స్ అన్నీ వుంటాయి  ఇది ఎంత పులిస్తే  అంత బాగుంటుంది  నిజం చెప్పాలంటే అందరి చేతికి ఇది పులవదు అంటారు  మాకు ఐతే ఇది సమ్మర్  స్పెషల్  మా ఇంటికి చాలా మంది వచ్చి తీసుకుని  వెళ్తారు  అప్పుడప్పుడు మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో కుండ ని  కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మళ్లీ  అలాగే బియ్యం కడిగిన వాటర్  అన్నం  గంజి వేసి పసుపు గుడ్డ ని కట్టి వుంచాలి మనం చారు చేసుకోవడానికి  కుండ లో వాటర్  ని గ్లాస్ లేదా గరిట తో మాత్రమే తీసుకోవాలి అది తీసుకున్న  వెంటనే మళ్లీ బియ్యం కడిగిన నీరు అన్నం గంజి వేసేయాలి ఇలా రోజూ తీయడానికి అవదు ఎందువల్ల అంటే ఆ వాటర్  బాగా పులిస్తేనే బాగుంటుంది  మంచిది కూడా...

*కలికుండ ఆరోగ్య రహ్యసం తరువాణి, వంటింట్లో కలికుండ- అన్నపూర్ణ*


 గ్లాస్ బియ్యము- 4 గ్లాసులు నీరుతో వండాలి. ఉడికిన తర్వాత గం జిని వార్చి చల్లిపరచిన తర్వాత- గంజిలో చిటికెడు మెంతులు వేసి కలికుండలో వుంచాలి. 24గం|| తర్వాత అన్నము వంటలో కలిపి వండాలి. మరల గంజిని వార్చి తీసుకోవాలి.


*దీనివల్ల ప్రయోజనాలు* -


1. గుండె జబ్బులు రావు


2. మోకాళ్ళ నొప్పులు రావు


3. షుగర్, బి.పి, మధుమేహము రాదు


4. సూక్ష్మధాతు లోపాల నివారణ


5. శరీర అలసట ఉండదు


6. కంటి చూపు తగ్గదు


7. శరీర బలిష్టము


8. వెంట్రుకలు రాలిపోవు


9. వ్యాధి నిరోధకశక్తిని పెంచును


10. శుక్రవృద్ధి, స్తన్యవృద్ధి అభివృద్ధి చెందును


ముఖ్యంగా గర్భిణి స్త్రీలు ఈ పద్దతి పాటించుటవలన గర్భస్థ శిశువులకు ఎలాంటి రోగాలు, అంగవైకల్యము లేకుండా జన్మించెదరు. డాక్టరు అవసరం రాదు.


*డాక్టర్ ఎం అశోక వర్ధన్ రెడ్డి*

Post a Comment

0 Comments