GET MORE DETAILS

ఆస్తి బదిలీకి ఏది ఉత్తమం...?

 ఆస్తి బదిలీకి ఏది ఉత్తమం...?



తమ ఆస్తిని వారసులకు అప్పగించేందుకు కొందరు వీలునామా రాస్తే, మరికొందరు గిఫ్ట్ డీడ్ రాస్తారు. అయితే ఈ రెండిటిలో ఏది ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. గిఫ్ట్ డీడ్కు పన్నులు వర్తించవు. కానీ వీలునామా రాయాలంటే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఉంటాయి. గిఫ్ట్ డీడ్ అది రాసిన వ్యక్తి బ్రతికున్నప్పుడే బదిలీ చేసే వీలుంటుంది. కానీ వీలునామా మనిషి మరణించిన తర్వాత బదిలీలకూ ఉపయోగపడుతుంది. కేవలం పన్నులు తగ్గుతాయి అనే విషయంపై ఆస్తులు బదిలీ చేయడం మంచి విషయం కాదు. కానీ వారసుల మధ్య గొడవలు రాకూడదు అని భావించినట్లయితే గిఫ్ట్ డీడ్ మంచి ఎంపిక. మీ వారసులకు గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి అనుకుంటే, మీ వృద్దాప్యంలో కష్టమైన స్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే వృద్ధాప్యంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవకుండా తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007 ప్రకారం, ఆ వ్యక్తికి తగిన ప్రాథమిక అవసరాలు సమకూరని పక్షంలో ఆ గిఫ్ట్ డీడ్ను మోసం, బలవంతపు బదిలీతో జరిగినట్లు గుర్తించి రద్దు చేస్తారు.

Post a Comment

0 Comments