GET MORE DETAILS

Blue Aadhaar: బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారు? దరఖాస్తు ఎలా...?

 Blue Aadhaar: బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారు? దరఖాస్తు ఎలా...?ఆధార్‌ కార్డు గురించి మనందరికీ తెలిసిందే. పూర్తి పేరు, శాశ్వత చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ 12 అంకెల సంఖ్యలో నిక్షిప్తమై ఉంటాయి. దేశ పౌరులందరికీ ఆధార్‌ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్‌ ఉండాల్సిందే. ధ్రువీకరణ పత్రంగానూ ఇది ఉపయోగపడుతోంది. సాధారణంగా ఆధార్‌ కార్డులు తెలుపురంగులో ఉంటాయని మనందరికీ తెలిసిందే. వయోజనులకు వీటిని జారీ చేస్తారు. మరి బ్లూ ఆధార్‌ కార్డు గురించి విన్నారా? దీన్నే బాల ఆధార్‌గా పేర్కొంటారు. పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఉండే ఆధార్‌ కార్డుల (Blue Aadhaar card)ను విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేస్తోంది. ఇంతకీ ఈ బాల ఆధార్‌ ఎలా తీసుకోవాలి?

బాల ఆధార్‌ అనేది ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేస్తారు. ఇందుకోసం పిల్లల బయోమెట్రిక్‌ వివరాలేవీ అక్కర్లేదు. కేవలం ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారంతో ఆధార్‌ను జారీ చేస్తారు. వీరి కార్డును తల్లిదండ్రుల ఆధార్‌ సంఖ్య (Aadhaar card)తో అనుసంధానిస్తారు. బాల ఆధార్‌ కార్డు కాలపరిమితి పిల్లల వయసు ఐదేళ్లు వచ్చేవరకే. తర్వాత వేలిముద్రలు, కంటిపాప వంటి వివరాలను అందజేసి ఆధార్‌కార్డుని అప్‌డేట్‌ చేసుకోవడంతో పాటు మళ్లీ 15 ఏళ్లు నిండిన తర్వాత కూడా ఈ వివరాలతోనే మరోసారి అప్‌డేట్‌ చేసుకోవాలి.

బాల ఆధార్‌ నమోదు ప్రక్రియ:

◾ఆధార్‌ నమోదు కేంద్రానికి తల్లిదండ్రులు ఆధార్‌ కార్డు (Aadhaar card), చిరునామా, పిల్లల జనన ధ్రువీకరణ పత్రం, ఒక ఫొటో తీసుకొని వెళ్లాలి.

◾ఆధార్‌ నమోదు ఫారంను తీసుకొని నింపాలి. అందులో తల్లిదండ్రుల ఆధార్‌ వివరాలను కూడా అందజేయాలి. ఈ ఫారాన్ని ఉడాయ్‌ వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

◾తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్‌నే పిల్లల ఆధార్‌ కార్డుకూ అనుసంధానిస్తారు. కాబట్టి కచ్చితంగా నంబర్‌ కూడా ఫారంలోనే నింపాలి. తర్వాత మీరిచ్చిన పత్రాలను ధ్రువీకరిస్తారు. వెంటనే మొబైల్‌ నంబర్‌కు నమోదు ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది.

◾అక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌ని తీసుకోవడం మర్చిపోవద్దు. అందులో ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ ఉంటుంది. దీంతో మీ పిల్లల ఆధార్‌ కార్డు అప్లికేషన్‌ వివరాలను పొందొచ్చు.

◾60 రోజుల్లోగా మీ పిల్లల పేరుపై బాల ఆధార్‌ (Baal Aadhaar) కార్డును జారీ చేస్తారు. బ్లూ ఆధార్‌ కార్డు జారీ పూర్తిగా ఉచితం.

Post a Comment

0 Comments