10 నిమిషాల ధ్యానం, ఎంతో లాభం !
ఏ అంశంపైనైనా ఏకాగ్రత చూపలేకపోతున్నారా? ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలపాటు ధ్యానం చేస్తే మనసు ఎక్కడెక్కడో సంచరించడాన్ని నివారించడంతోపాటు, పున రావృత, ఆందోళనకరమైన ఆలోచనల్ని తగ్గించవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కెనడా వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆందోళనతో బాధపడుతున్న 82 మందిపై ధ్యానం ప్రభావాన్ని పరిశీలించారు. ప్రస్తుత మానసిక స్థితిపై అవగాహన పెంచడం ద్వారా పదేపదే ఒకే ఆలోచన రావడం, ఆందోళనకు దారితీసే ఇతరత్రా ఆలోచనలను తగ్గిస్తున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. ధ్యాన సాధన ద్వారా అంతర్గతంగా సతమతమవుతున్న ఆందోళనకరమైన ఆలోచనల నుంచి బయటి ప్రపంచంలోని ప్రస్తుతి స్థితిపై ఏకాగ్రత కుదిరినట్లు తమ అధ్యయనంలో గుర్తించామని పరిశోధకులు మెంగ్రన్ క్సూ పేర్కొన్నారు. ఆందోళన, పునరావృత ఆలోచనలు అభ్యాస సామ ర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు.
0 Comments