GET MORE DETAILS

28-03-2024 - గురువారం - రాశి ఫలితాలు

28-03-2024 - గురువారం - రాశి ఫలితాలు

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈



మేషం:

అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. విద్యార్థుల ఫలితాలు  నిరుత్సాహ పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

---------------------------------------

వృషభం:

ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల  నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

---------------------------------------

మిధునం:

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం  ఉంటుంది. కుటుంబ విషయమై  ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు.

---------------------------------------

కర్కాటకం:

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన ధన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో  యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత  ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

సింహం:

అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన  పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది.

---------------------------------------

కన్య:

ఇంటా బయట  అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు  దర్శిస్తారు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.

---------------------------------------

తుల:

విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుండి  శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.  నూతన వాహనయోగం ఉన్నది. స్థిరాస్తి వివాదాల పరిష్కారదిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక  నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు.   ఉద్యోగమున  అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------

వృశ్చికం:

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన  పనులు వాయిదా వేస్తారు. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.  ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి.

---------------------------------------

ధనస్సు:

బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో  పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.   నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు  ఫలిస్తాయి.  వృత్తి  ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------

మకరం:

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన  వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.  ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

కుంభం:

నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో  సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి  శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------

మీనం:ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో  కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున  ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారాలు  అనుకున్న విధంగా రాణిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.

Post a Comment

0 Comments