GET MORE DETAILS

కన్య రాశి జాతకం 2024

 కన్య రాశి జాతకం 2024కన్య రాశి వారికి వార్షిక ఆర్థిక జాతకం 2024 యొక్క సూచనల ప్రకారం , ఈ సంవత్సరం మీ ఆర్థిక ప్రయాణంలో చాలా సవాళ్లు మరియు ఒడిదుడుకులను తెస్తుంది. ఈ కాలంలో మీ సమస్యలను అధిగమించడానికి మీరు తీవ్రంగా పోరాడవలసి ఉంటుంది. కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి మరియు ఈ సంవత్సరం అదృష్ట పరీక్షలో నిలబడండి.2024 కొత్త ఏడాదిలో కన్య రాశి వారికి తిరుగనేదే ఉండదట..! అయితే ఆ ఒక్క నెలలో తస్మాత్ జాగ్రత్త..!జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నూతన సంవత్సరంలో కన్య రాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది. కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2024 జ్యోతిష్యం ప్రకారం, కన్య రాశి వారికి నూతన సంవత్సరంలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి ఏడాది పొడవునా శని దేవుడు ఆరో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ కారణంగా మీరు ఆరోగ్యం, విద్య, ఇతర రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు. మే మాసంలో గురుడు ఈ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో వృషభరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో శుభ ఫలితాలు రానున్నాయి. అయితే రాహువు, కేతువు ప్రభావంతో కొంత ప్రతికూల ఫలితాలు రానున్నాయి. వీటి ప్రభావాలను తగ్గించడంలో గురువు సహాయపడనున్నాడు. 

ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కన్య రాశి వారికి ఏయే శుభ, అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఈ రాశి నుంచి ఎనిమిదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు ఆరోగ్య ప్రయోజనాలు పొందనున్నారు. ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు మానసికంగా ఒత్తిడి కలగొచ్చు. మీ పెండింగ్ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ఈ కాలంలో మీకు డబ్బు తిరిగి పొందాలనే ఆశ పుడుతుంది.ఈ రాశి నుంచి శని దేవుడు ఆరో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో కన్య రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. 

ఉద్యోగులకు మెరుగైన ఫలితాలొస్తాయి. ఏడాది పొడవునా శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు. మీరు బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఈ ఏడాది విజయం సాధించొచ్చు. కొన్ని పాత వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు.గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ 14 తర్వాత గురుడితో కలిసి సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుంచి ఎనిమిదో స్థానంలో ఈ కలయిక జరగనుందది. ఈ సమయంలో విపరీత రాజయోగం కారణంగా కన్య రాశి వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. విదేశాలలో పని చేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే వారు పదోన్నతులు పొందుతారు.

గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు(కుజుడు) మార్చి 15న శత్రువుగా పరిగణించే శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ 23వ తేదీ వరకు అక్కడే సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుంచి ఆరో స్థానంలో శని, కుజుడి కలయిక జరగనుంది. ఈ సమయంలో కన్య రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్య ప్రణాళికలు రూపొందిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు చేయొచ్చు. మీ అప్పులు కూడా పెరగొచ్చు. శని, కుజుడి సంచారం వేళ మీరు ఎవరి దగ్గరా అప్పులు తీసుకోకూడదు. ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు.2024 సంవత్సరంలో రాహువు ఈ రాశి నుంచి ఏడో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి. అయితే వ్యాపారులకు కొంత పురోగతికి మార్గం సులభమవుతుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు రావొచ్చు. 

మీ జీవిత భాగస్వామితో ఎలాంటి వాగ్వాదం చేయాల్సిన అవసరం లేదు. మీ భాగస్వామ్యంతో ఏదైనా పని చేయాలనుకుంటే, ఆలోచనాత్మకంగా కొనసాగాలి.ఈ రాశి నుంచి శుక్రుడు మార్చి 31 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో రాహువు, శుక్రుడి కలయిక జరగనుంది. ఈ కారణంగా మీకు దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. మీ కోరికలు పెరిగే అవకాశం ఉంది. ఇతర వ్యక్తుల జోక్యంతో మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావొచ్చు.2024 సంవత్సరంలో కేతువు సంచారం వల్ల కన్య రాశి వారికి మతపరమైన రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ కాలంలో మీరు మతపరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. 

ఆధ్యాత్మికత మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కేతువు ప్రభావంతో సీజనల్ వ్యాధులు రావొచ్చు. కాబట్టి మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.2024 నూతన సంవత్సరంలో మీ ప్రేమ సంబంధాల విషయంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. శని, రాహు గ్రహాల ప్రభావంతో మీరు కుటుంబ సభ్యులకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొంత విభజన ఉండొచ్చు. మీరిద్దరూ ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే, 2024లో చాలా మంచిగా ఉంటుంది.కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి కెరీర్, వ్యాపారం పరంగా గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. 

ఏప్రిల్ నుంచి మీ కెరీర్లో పురోగతి సాధించేందుకు అవకాశాలు పెరగనున్నాయి. వ్యాపారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు అంకిత భావంతో పని చేస్తారు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి దిగుబడి వస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలొస్తాయి.కొత్త ఏడాదిలో కన్య రాశి వారికి రాహువు, కేతువు గ్రహాల ప్రభావంతో ఆరోగ్య పరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు బయటి ఆహారాన్ని తగ్గించాలి. 

వైరల్ వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులు, ఇతర రోగాలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.కొత్త ఏడాదిలో సంవత్సరం పొడవునా దుర్గా చాలీసా లేదా సప్తశతి పఠించాలి. వినాయకుడికి క్రమం తప్పకుండా దుర్వా సమర్పించాలి. దీంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీరు రుద్రాక్షను ధరించాలనుకుంటే, ఎనిమిది లేదా పది ముఖాలుండే రుద్రాక్షలను ధరించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.

Post a Comment

0 Comments