GET MORE DETAILS

27-03-2024 - బుధవారం - రాశి ఫలితాలు

27-03-2024 - బుధవారం - రాశి ఫలితాలు

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈



మేషం:

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణంగా విబేధాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చెయ్యకపోవడం మంచిది.

---------------------------------------

వృషభం:

ఆదాయం మరింతగా పెరుగుతుంది. సమాజంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

---------------------------------------

మిధునం:

నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు.  సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు.  ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.

---------------------------------------

కర్కాటకం:

బంధుమిత్రులు మాటలు కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వృధా ప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు అమలుపరచాలి. ఉద్యోగులు  అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

సింహం:

ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో   కొన్ని విషయాలలో మనస్పర్థలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి  వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

---------------------------------------

కన్య:

మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున  అధికారుల సహాయంతో వివాదాలు  పరిష్కరించుకుంటారు.

---------------------------------------

తుల:

దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తివ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులు మరింత కష్ట పడవలసి రావచ్చు.

---------------------------------------

వృశ్చికం:

సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు లభిస్తాయి. దూరప్రాంతం బంధువుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత  కలుగుతుంది.

---------------------------------------

ధనస్సు:

ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు  మానసికంగా బాధిస్తాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని చిక్కులు తప్పవు. ఉద్యోగమున ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి.

---------------------------------------

మకరం:

దూర ప్రాంత ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

---------------------------------------

కుంభం:

వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగి  ఊరట చెందుతారు. ఇంటాబయట సఖ్యతగా వ్యవహరించి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

---------------------------------------

మీనం:

దూరప్రయాణాలు శ్రమ మీద పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమన అదనపు పని ఒత్తిడి పెరిగి  మానసిక సమస్యలు కలుగుతాయి.

Post a Comment

0 Comments