మైలురాయికి రంగులెందుకు...!
ఊరెళ్తుంటే ఇంకెంత దూరం అబ్బా... అంటూ మైలురాయిని చూసిన ప్రతీసారి అనుకుంటూ ఉంటాం. కాస్త ముందుకెళ్లాక దగ్గరికొచ్చేశాం అని మళ్లీ దాన్ని చూసే సంతోష పడుతుంటాం. అయితే ఈ మైలురాళ్ల మీద కిలోమీటరు నంబరుతోపాటు పై భాగంలో వివిధ రంగులేసి ఉంటాయి. మీరెప్పుడైనా గమనించారా? అలా వాటికి వేసే ఒక్కో రంగుకు ఒక్కో అర్థం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
• ఆరెంజ్ కలర్ ఉంటే అది గ్రామీణ రోడ్డు అని అర్థం. దేశంలో గ్రామీణ రోడ్లు 3.93 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.
• తర్వాత నీలం లేదా నలుపు రంగు ఉంటే జిల్లా రోడ్లు అని అర్థం. ఇవి 5,61,940 కిలోమీటర్ల మేర ఉన్నాయి.
• అలాగే ఆకుపచ్చ రంగు ఉంటే రాష్ట్రంలోని ప్రధాన నగరాలను కలుపుతూ నిర్మించే రోడ్లు ఇవి.
• చివరగా పసుపు రంగు వేసి ఉంటే అది జాతీయ రహదారి అని అర్థం. ఇవి రాష్ట్రాలను, పెద్ద పెద్ద నగరాలను కలుపుతాయి. దేశంలో 1,51,019 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి.
0 Comments