GET MORE DETAILS

కన్య రాశి : 2024-25 తస్మాత్ జాగ్రత్త

 కన్య రాశి : 2024-25 తస్మాత్ జాగ్రత్తశ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్య రాశి వారికి కష్టాలు తప్పకపోవచ్చు..! తస్మాత్ జాగ్రత్త

తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ పాడ్యమి తిథి.. ఉగాది రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈసారి ఏప్రిల్ 9వ తేదీ నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కన్య రాశి వారు తమ లక్ష్యాలను సాధించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సమయానికి డబ్బు చేతికందకపోవచ్చు. ఉద్యోగులకు పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ప్రమోషన్ విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కాలం కలిసొస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. 

ఈ సందర్భంగా ఉగాది తర్వాత కన్య రాశి వారి జీవితంలో ఇంకా ఎలాంటి మార్పులు జరగనున్నాయనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఉగాది తర్వాత గురుడు ఈ రాశి నుంచి భాగ్య స్థానంలో సంచారం చేయనున్నాడు. శని ఆరో స్థానంలో రవాణా చేయనున్నాడు. రాహువు ఏడో స్థానం, కేతువు ఒకటో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల కన్య రాశి వారికి కొత్త ఏడాదిలో శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ రాశి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల మార్పు వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం, పెట్టుబడులను నివారించడం వల్ల మంచి ఫలితాలొస్తాయి.

తెలుగు నూతన సంవత్సరంలో కన్య రాశి వారి రాజపూజ్యం-05, అవమానం-02గా ఉంటుంది. కొత్త ఏడాదిలో మీ కుటుంబ జీవితంలో కొన్నిసవాళ్లు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి. ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని పొందుతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాలు పొందుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు పరస్పరం సహకరించుకోవాలి.

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో విద్యా పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు చేసే అధ్యయనం నుంచి అద్భుత ప్రగతి సాధిస్తారు. మీకు ఆసక్తి ఉన్న రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలున్నాయి. మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణా కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్య రాశి వారికి కెరీర్ పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు, కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు. ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తే, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.ఈ రాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆరోగ్య పరంగా కొన్ని సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, వ్యాయామ దినచర్యను అనుసరించాలి. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంత ఒత్తిడి, ఆందోళన కారణంగా ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కాలంలో భాగస్వాములతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను ఎదుర్కొంటారు. అవివాహితులకు వివాహ చేసుకోవాలనే ప్రణాళిక ఆలస్యం కావొచ్చు. లేదంటే మీ వివాహానికి అంతరాయం కలగొచ్చు. మరోవైపు వివాహితులు తమ భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోడానికి మంచి అవకాశాలొస్తాయి. అవివాహితులు వివాహం విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి.

• గురువారం రోజున పసుపు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేయాలి.

• ఉగాది తర్వాత గణేశుడికి ప్రత్యేక పూజలు చేయాలి. గణేశుని ఆలయాలను సందర్శించాలి.

• మీ శక్తి, సామర్థ్యం మేరకు పేదలకు సాయం చేయాలి.

• దుర్గాదేవిని పూజించి, సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి.

Post a Comment

0 Comments