రోగులకు తప్పుడు ప్రిస్ర్కిప్షన్లు - టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో 45% మంది డాక్టర్ల తీరు ఇదీ - వీరందరూ 4- 18 ఏళ్ల సర్వీసు ఉన్నవారే: ఐసీఎంఆర్
దేశంలోని టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో సేవలందిస్తున్న కొందరు వైద్య నిపుణుల తీరుపై ఐసీఎంఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
వీరి తీరు రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతోందని ఆ సంస్థ ఇటీవల నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ అసుపత్రి సహా 13 ప్రముఖ వైద్యసంస్థల్లో నిర్వహించిన ఈ సర్వేలో 45% మంది వైద్యులు తమ రోగులకు ఇస్తున్న ప్రిస్ర్కిప్షన్లు అసంబద్ధంగా ఉంటున్నాయని తేలింది. అధ్యయనంలో భాగంగా ఈ వైద్యసంస్థల్లో మొత్తం 7,800 మంది రోగుల నుంచి ప్రిస్ర్కిప్షన్లు సేకరించి పరిశీలించారు. ఆ తర్వాత వారిలో 4,838 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, 2,171 ప్రిస్ర్కిప్షన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
అం.దులోనూ 475 (9.8%) పూర్తి తప్పులతడకలు కాగా, మరో 102 ప్రిస్ర్కిప్షన్లలో ఒకటి కంటే ఎక్కువ రోగ నిర్ధారణలు జరిగాయి. మరికొన్నింటిలో రోగానికి అసలు సంబంధమే లేని మందులు రాశారు. ఇలాంటి లోపభూయిష్ఠమైన ప్రిస్ర్కిప్షన్లు ఇచ్చిన డాక్టర్లు అందరూ ఆయా విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్లు కావడంతో పాటు సగటున 4 నుంచి 18 ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్నవారే కావడం విశేషం.
0 Comments