శ్రీరామనవమి రోజున వడపప్పు, పానకం స్వీకరిస్తారు. అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి ?
పానకం:
పానకం బెల్లం, మిరియాలు, శొంఠి కలిపిన మిశ్రమం.
సాధారణంగా వేసవి ప్రారంభం లో వచ్చే పండుగ వేడుకలలో తీసుకునే పానకం ORS లాగా పనిచేసి, శరీరం చెమట రూపం లో కోల్పోయిన నీటిని, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలను తిరిగి అందిస్తుంది.
వడపప్పు:
వడపప్పు, నానబెట్టిన ఈ పెసరపప్పు ప్రొటీన్లను, క్రొవ్వులను కలిగిన తేలికగా జీర్ణం అయే పదార్థం.
A,B complex vitamin ల ని కలిగి ఉండటం తో పాటు, blood sugar levels ని తగ్గిస్తుంది కాబట్టి, high sugars ను కలిగిన పానకం తో పాటుగా తీసుకోదగిన జోడీ. వడపప్పులోని పుల్ల మామిడి ముక్కలు సీజనల్ గా విటమిన్ C ని అందిస్తాయి.
శ్రీరామ నవమి ఎందుకు జరుపుకోవాలి అనేది పక్కన పెడితే, ఈ నైవేద్యం సంవత్సరంలో మళ్లీ దొరకదు కాబట్టి ప్రసాదం అనుకునో పోషకాహారం అనుకునో ఈ సమతులాహారం(balanced diet) దొరికితే లాగించేయడం మంచిది.
వడపప్పు, పానకం, విసనకర్ర:
శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకం ప్రసాదంగా ఇస్తారు. విసనకర్రలు దానం చేస్తారు. ఉగాది తర్వాత వచ్చే పండగల్లో శ్రీరామనవమి ముఖ్యమైనది. ఆనాడు లోకకళ్యాణార్థం సీతారాముల కళ్యాణం వేదమంత్రాలతో, పాటలతో జరిపించాక వడపప్పు, పానకం ఇస్తారు.
నానబెట్టిన పెసరపప్పునే వడపప్పు అంటారు. శ్రమను హరించే పప్పు వడపప్పు. శ్రమ పడినప్పుడు ఎండాకాలంలో వడ కొడుతుంది. శ్రీరామనవమి చైత్రమాసంలో కొంత వేడి ప్రారంభంలో వచ్చే పండగ. వడపప్పు తినడం చేత చల్లదనం ఏర్పడుతుంది.
పానకం అనేది బెల్లం, మిరియాలతో చేస్తారు. పానకం శుభకార్యక్రమాలలోనే అవసరం పెళ్ళిళ్ళలో పానకం బిందెలు ఇవ్వడంలో ఒకతతంగం మాధుర్యమే కాక ఎదుటివారు చల్లగా వుండాలనేది కూడా వుంది. సీతారాముల కళ్యాణం ఒక శుభపర్వం. ఆ సందర్భాలన పానకం పంపకం తీయని సందర్భం.
పూర్వకాలంలో వేసవి కాలంలో విద్యుచ్ఛక్తి ఉండని కాలంలో, ఫ్యాన్లూ అవీ లేని కాలంలో తాటాకు విసనకర్రలే తాపం పోవడానికి, గాలి రావడానికీ వాడుకునేవారు. విసనకర్రలు గతంలో రెండు రకాలుగా వుండేవి. వెదురుతో చేసిన విసన కర్రలు పొయ్యిలకి, కుంపట్లకీ ఉపయోగించేవారు. తాటాకు విసనకర్రలు గాలి పొందడానికి, తాపాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగించేవారు. మామిడిపండ్ల కాలం రావడంతో మామిడిపళ్ళు, విసనకర్రలు ఇవ్వడం పుణ్యప్రదం. అంతేకాదు, ఇతరులు హాయిగా వుండటం కోరుకోవడం కూడా వుంది. శ్రీరామనవి నాడు విసనకర్రలు దానం చేయడం కూడా అందుకే.
0 Comments