నేటి విశేషం - శ్రీరామనవమి (చైత్రశుద్ధ నవమి - పునర్వసు నక్షత్రం - కర్కాటక లగ్నం)
చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు "అభిజిత్ముహుర్తంలో” శ్రీరామచంద్రమూర్తి దశరధుని కుమారునిగా జన్మించినట్లు వాల్మీకి రామాయణం తెలుపుతున్నది, అందువల్ల ఈ పుణ్యదినమును మనం అనాదిగా “శ్రీరామనవమి” పండుగగా జరుపుకుంటున్నాము!
రామ కళ్యాణం :
అలానే శ్రీరాముని కళ్యాణమూ, రాముడు రావణుడిని వధించి దిగ్విజయంగా అయోధ్యకు వచ్చినది కూడా ఈ “శ్రీరామనవమి” నాడే! మరునాడు అనగా దశమినాడు శ్రీరామ పట్టాభిషేకము.
ఈ రోజున తన శక్తి కొలదీ ప్రతీవారూ సీతారామ భరతశత్రుఘ్నుల విగ్రహ మును గాని, పటమును గాని పెట్టి, పూజచేయాలి! కనీసం హనుమత్సమేతుడుగా సీతామాతతో సహితుడైన శ్రీరామచంద్రమూర్తిని పూజించవలెను. పీఠం పైనగాని పూజా మందిరంలోగాని కడిగి పసుపు రాసిన పీటవేసి, దానిపై బియ్యం పిండితోనూ, కుంకుమ తోనూ అలంకరించి పీట మధ్యన చందనముతో అష్టదళ పద్మమును వ్రాయాలి. దానిపై ఒక కొత్త బట్టను (తెల్లని పట్టుపంచె) పరచి, బియ్యముతో 'స్టండిలము' ఏర్పాటు చెయ్యాలి! ("స్థండిలము" అనగా నలుచదరముగా పీటపై బియ్యము పోసి అర అంగుళము మందంగా బియ్యాన్ని చదునుగా ఏర్పాటు చేయడం)'
దాని మధ్యంలో కలశమునూ, దానిపై కొబ్బరికాయనూ అమర్చి, ఎర్రని పట్టుగుడ్డలు (లేక కొత్త జాకెట్టు గుడ్డను) కిరీటంలాగా పెట్టాలి. ఈ 'కలశం' వెండి దైనా రాగిదైనా, కంచుదైనా మంచిదే. దీనికి చందనముతోనూ, కుంకుమతోనూ, పసుపుతోనూ బొట్లు పెట్టి అలంకరించాలి! బియ్యం, పంచ వల్లవములు, మామిడాకులు, రావిదళములను, రేరుడు (వీలైనన్ని రకములు యధాశక్తి తెచ్చి) కలశంలో వెయ్యాలి! కలశము గంధ పుష్పాక్షతలతో పూజించి- కలశం చుట్టూ అష్టదిక్పాలకు లనూ, నవగ్రహములనూ, “అధిదేవతా - ప్రత్యధిదేవతా” సహితముగా ఆవాహన చేసి ‘మండపారాధన' చేయాలి.
పూజా మండపమునకు నాలుగు ప్రక్కలా అరటి పిలకలు, లేత చెరకుగడలూ కట్టి పూలతోనూ, మామిడాకులతోనూ అలంకరించాలి. పూజ జరిగే పందిరికి స్తంభాలు కొబ్బరిఆకులు అరటిబోదెలు కట్టి, మామిడితోరణాలతో అలంకరించాలి. తర్వాత పురుషసూక్త సహితముగా శ్రీరామచంద్రమూర్తిని సపరివార సమేతముగా పూజచేయాలి. ‘రామాష్టోత్తర శతము', 'సీతాష్టోత్తర శతము', 'ఆంజనేయాష్టోత్తర శతము' చదువుతూ తులసి, మారేడు, తమలపాకులతో ఒక్కొక్క నామంతో పూజించాలి. తులసితో రామచంద్రుని, మారేడు దళములతో సీతాదేవిని, తమలపాకు లతో ఆంజనేయుని పూజించి, శ్రీసూక్త పురుషసూక్తములూ, విష్ణుసహస్రనామము పఠించవలెను. రామాయణంలోని “శ్రీరామపట్టాభిషేకసర్గ" (రామాయణం పారాయణ చేయని పక్షంలో) ను చదువవలె.
నైవేద్యం: చక్కెరపొంగలి, మామిడిపండ్లు, చెరకుముక్కలూ పానకము, వడపప్పుతో నైవేద్యమిచ్చి కర్పూరహారతిని ఇవ్వాలి. ఆసక్తి కలిగినవారు 'చైత్ర నవరాత్రులు' అనగా సంవత్సరాది నుంచి ప్రారంభించి, నవమి తిథివరకు ఈ రీతిగా పూజించవచ్చు! దశమి రోజున కల్యాణం, పట్టాభిషేకం జరిపించవచ్చు! శ్రీరామ నవమి పండుగ, పునర్వసు నక్షత్రంతో కలిసినప్పుడు అదిమహా పర్వదినమే! అటువంటి పుణ్య సందర్భం ఏర్పడినప్పుడు, రాత్రి జాగరణ, (శ్రీరామనామం జపం గాని, నామసంకీర్తన గాని) లేదా రామాయణం పారాయణ గాని చేయాలి.
శ్రీరామనవమి ఉత్సవాలు - వేడుకలు:
ఈ పండుగ రోజులలో దేశమంతా పచ్చతోరణాలతో పందిళ్ళతో, దీపాల అలంకరణలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరారుతుంది. ఈ పండుగనాడు పానకం, వడపప్పు, విసనకర్రలు పంచిపెడతారు. ఎర్రని నిప్పులు చెరిగే ఎండా కాలంలో వచ్చే ఈ పండుగనాడు చల్లదనాన్ని కలిగించే వీటిని పంచడంలో పరమార్ధ మెంతో ఉంది. వడపప్పు తిని, పానకం సేవించడం వల్ల జనులు ఎండల వేడినుండి ఉపశాంతి పొందుతారు. పసుపు, కుంకుమలతో అలంకరించి పూజించిన విసన కర్రలను పంచడమనేది మానవత్వాన్ని మేల్కొలుపుతొంది. తియ్యని పానకం తాగుతూ, తియ్యని రామకథా విశేషాలను తెల్సుకుంటూ ప్రజలు ఈ పండుగ సమయాల్లో ఆనందంగా గడుపుతారు.
శ్రీరామచంద్రుని స్మరించే వారికి ఏ చెడు గ్రహముల బాధలూ కలుగవు ఒక నానుడి తెలుపుతున్నది. "గ్రహబలమేమి? రామానుగ్రహబలముగాని!” అని కదా రామభక్తుడైన రామదాసు తన కీర్తనలో శ్రీరాముని కరుణను కీర్తించాడు.
రామసుధ:
రామనామాన్ని జపించేవారికి భయముండదు. రామనామ జపం సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషధం.
◾రామనామం త్రిమూర్తులకు ప్రతీక.
◾రామనామం మోక్షదాయకం-మోక్షకారకం.
◾నిధికన్న-రాముని సన్నిధే మిన్న.
◾సకల సద్గుణ నిలయుడు శ్రీరాముడు.
◾శ్రీరామ నామస్మరణే ముక్తికి మార్గము.
◾మూర్తీభవించిన ధర్మమే శ్రీరాముడు.
◾శ్రీరామ రక్ష-సర్వజగద్రక్ష.
◾సీతవల్ల భూలోకం పావనమైంది
◾రామ సంకీర్తన జరిగేచోట హనుమంతుడు వుంటాడు.
◾ముల్లోకాల్లో రాముని వంటి పురుషోత్తముడు లేడు.
◾స్త్రీలు ప్రణవము(ఓంకారము) చెప్పేబదులు 'రామా'అని రాస్తే సరిపోతుంది.
వివాహము ఎలా జరగాలో నేర్పి చూపించిన అవతారము శ్రీ రామ అవతారము. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి జరిగి ఉండవచ్చు. రామనామ వైభవము మాత్రము అలా ఉండిపోయింది. వశిష్ఠుడు ఇచ్చిన రామనామము ఎంతగొప్పది అంటే ర అన్న అక్షరము అష్ఠాక్షరీ మహా మంత్రములోని ప్రధానమైన బీజాక్షరము. మ కారము పంచాక్షరీ మహా మంత్రములో ఉన్న ప్రధానమైన బీజాక్షరము. రామ అన్నప్పుడు అగ్ని బీజము అమృత బీజము అనుసంధానము ఎవరు రామ నామమును చదువుతుంటే ర అనడమువలన అగ్నిచేత పాపములు కాలిపోతాయి. మ అన్నప్పుడు నోరు మూసుకుని మళ్ళీ పాపములు లోపలకు వెళ్ళే అవకాశము ఉండదు. రాముని ఉద్దేశించి అనకపోయినా శ్రీరామ అన్నా రామ అన్న నామమునకు అంత శక్తి ఉన్నది. ఎంత కాలము రామనామము చెప్పబడుతుందో రామాయణము ఎంత కాలము చదవబడుతుందో ఎంతకాలము రామచంద్రమూర్తిని మనము అనువర్తిస్తామో రాముడిని ఆదర్శముగా తీసుకుని బతుకుతామో అంతకాలము శ్రీరామ రాజ్యము విలసిల్లుతుంది. లోకము సుభిక్షముగా ఉంటుంది. రామచంద్రమూర్తి జీవితమును చెప్పుకుంటే చాలు. అందరికీ రామ భక్తి కలుగుగాక స్వామి మన చేత రామనామము పలికించుగాక రామును యొక్క బలము పెరుగుగాక.
శ్రీ రామనవమి నాడు మకుట ధారణ సర్గ లేదా కనీసం మకుటధారణకు సంబంధించిన ఈ శ్లోకములనైనా పారాయణ చేయడం విధి.
• శ్రీ వాల్మీకి రామాయణం - యుద్ధకాండ లోని పట్టాభిషేక సర్గ నుండి మకుట ధారణ ఘట్టానికి సంబంధించిన శ్లోకాలు (64 - 67)
• బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితమ్
అభిషిక్తః పురా యేన మనుస్తం దీప్తతేజసమ్! 64
• తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః
సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః! 65
• రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః
నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి! 66
• కిరీటేన తతః పశ్చాద్వసిష్ఠేన మహాత్మనా
ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః! 67
పూర్వము బ్రహ్మ నిర్మించిన రత్నమయమైన, తేజస్సుతో ప్రకాశించుచున్న కిరీటమును సభామధ్యములో ఉన్న వివిధరత్నములు పొదిగిన పీఠముపై యథావిధిగా ఉంచెను. పట్టాభిషేక సమయమునందు పూర్వము మనుచక్రవర్తి, తరవాత క్రమముగా ఆయన వంశమునకు చెందిన రాజులందరు ఆ కిరీటమును ధరించెడివారు. ఆ మహాసభా భవనము బంగారము చేత అలంకరింపబడెను, చాల విలువైన వస్తువులతో శోభించుచుండెను. అనేక విధములైన చాలా అందమైన రత్నములతో అది చిత్రవర్ణమై ఉండెను. పిదప రత్నపీఠముపై ఉంచిన ఆ కిరీటముని తీసి వసిష్ఠుడు రాముని శిరస్సుపై అలంకరించెను. అనంతరము ఋత్విక్కులు రామునకు ఇతరాలంకారములు అలంకరించిరిశ్రీ సీతారామ కళ్యాణ సర్గః
1. యస్మింస్తు దివసే రాజా చక్రే గోదాన ముత్తమమ్ |
తస్మింస్తు దివసే వీరో యుధాజిత్సముపేయివాన్ ǁ
2. పుత్రః కేకయరాజస్య సాక్షాద్భరతమాతులః |
దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజాన మిద మబ్రవీత్ ǁ
3. కేకాయాధిపతీ రాజా స్నేహాత్ కుశల మబ్రవీత్ |
యేషాం కుశలకామోఽసి తేషాం సంప్ర త్యనామయమ్ ǁ
4. స్వస్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతిః |
తదర్థ ముపయాతోఽ హ మయోధ్యాం రఘునందన ǁ
5. శ్రుత్వా త్వహ మయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ |
మిథిలా ముపయాతాంస్తు త్వయా సహ మహీపతే ǁ
6. త్వరయాఽభ్యుపయాతో ఽహం ద్రష్టుకామః స్వసుః సుతమ్|
అథ రాజా దశరథః ప్రియాతిథి ముపస్థితమ్ |
దృష్ట్వా పరమసత్కారైః పూజనార్హమపూజయత్ ǁ
7. తతస్తా ముషితో రాత్రిం సహ పుత్రై ర్మహాత్మభిః |
ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ |
ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాట ముపాగమత్ ǁ
8. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః |
భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగళః ǁ
9. వసిష్ఠం పురతః కృత్వా మహర్షీ నపరానపి |
పితుః సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః |
వసిష్ఠో భగవా నేత్య వైదేహ మిద మబ్రవీత్ ǁ
10. రాజా దశరథో రాజన్ కృతకౌతుకమంగళైః |
పుత్రై ర్నరవర శ్రేష్ఠ దాతార మభికాంక్షతే ǁ
11. దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి హి |
స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్య ముత్తమమ్ ǁ
12. ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా |
ప్రత్యువాచ మహాతేజా వాక్యం పరమధర్మవిత్ ǁ
13. కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే |
స్వగృహే కో విచారోఽస్తి యథా రాజ్యమిదం తవ ǁ
14. కృతకౌతుకసర్వస్వా వేదిమూల ముపాగతాః |
మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నే రివార్చిషః ǁ
15. సజ్జోఽహం త్వత్ప్రతీక్షో ఽస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః |
అవిఘ్నం కురుతాం రాజా కిమర్థ మవలంబతే ǁ
16. తద్వాక్యం జనకే నోక్తం శ్రుత్వా దశరథ స్తదా |
ప్రవేశయామాస సుతాన్ సర్వా నృషిగణానపి ǁ
17. తతో రాజా విదేహానాం వసిష్ఠ మిద మబ్రవీత్ |
కారయస్వ ఋషే సర్వామృషిభిః సహ ధార్మిక |
రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో ǁ
18. తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవా నృషిః |
విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికమ్ ǁ
19. ప్రపామధ్యే తు విధివ ద్వేదిం కృత్వా మహాతపాః |
అలంచకార తాం వేదిం గంధపుష్పైః సమన్తతః ǁ
20. సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః |
అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః ǁ
21. శంఖపాత్రైః స్రువైః స్రుగ్భిః పాత్రై రర్ఘ్యాభిపూరితైః |
లాజపూర్ణైశ్చ పాత్రీభి రక్షతై రభిసంస్కృతైః ǁ
22. దర్భైః సమైః సమాస్తీర్య విధివ న్మంత్రపూర్వకమ్ |
అగ్నిమాధాయ వేద్యాం తు విధిమంత్రపురస్కృతమ్ |
జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవానృషిః ǁ
23. తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితామ్ |
సమక్ష మగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా |
అబ్రవీ జ్జనకో రాజా కౌసల్యానందవర్ధనమ్ ǁ
24. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ |
ప్రతీఛ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా ǁ
25. పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతా సదా |
ఇత్యుక్త్వా ప్రాక్షిప ద్రాజా మంత్రపూతం జలం తదా ǁ
26. సాధు సాధ్వితి దేవానా మృషీణాం వదతాం తద |
దేవదుందుభినిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్ ǁ
27. ఏవం దత్వా తదా సీతాం మంత్రోదకపురస్కృతామ్ |
అబ్రవీ జ్జనకో రాజా హర్షే ణాభిపరిప్లుతః ǁ
28. లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళా ముద్యతాం మయా |
ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మా భూత్కాలస్య పర్యయః ǁ
29. తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత |
గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందనǁ
30. శతృఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీ జ్జనకేశ్వరః |
శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా ǁ
31. సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః |
పత్నీభిః సంతు కాకుత్థ్సా మా భూత్కాలస్య పర్యయః ǁ
32. జనకస్య వచః శ్రుత్వా పాణీం పాణిభి రస్పృశన్ |
చత్వారస్తే చతసృణాం వసిష్ఠస్య మతే స్థితాః ǁ
33. అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ |
ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః |
యథోక్తేన తథా చక్రు ర్వివాహం విధిపూర్వకమ్ ǁ
34. పుష్పవృష్టి ర్మహత్యాసీ దంతరిక్షాత్సుభాస్వరా |
దివ్యదుందుభినిర్ఘోషై ర్గీతవాదిత్రనిఃస్వనైః ǁ
35. ననృతు శ్చాప్సరస్సంఘా గంధర్వాశ్చ జగుః కలమ్|
వివాహే రఘుముఖ్యానాం తదద్భుత మదృశ్యత ǁ
36. ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్ఠనినాదితే |
త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహు ర్భార్యా మహౌజసః ǁ
37. అథోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనాః |
రాజా ప్యనుయయౌ పశ్యన్సర్షిసంఘః సబాంధవః ǁ
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రిసప్తతితమః సర్గః
శుభమస్తు
సమస్త లోకా సుఖినోభవంతు
0 Comments