GET MORE DETAILS

పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు...

 పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు...



• గృహంలో దేవతా విగ్రహాలు  బొటనవేలు కన్నా పెద్దగా ఉండరాదు.

• మంత్ర పుష్పం సుప్రభాతం కుర్చుని చదవరాదు.

• ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు.

• బొట్టు విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు.

• ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు. అలా చేస్తే పైజన్మలో చేతులు లేకుండా జన్మించటం కానీమధ్యలో చేతులు పోవటం కానీ జరుగుతాయి.

• ఈశ్వరుడికి వీపు చూపరాదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు.

• ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణి కడ్డికానీ, హారతికర్పూరంకానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు.

• పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులోవుండాలి. అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి.  ఎడం చేయి పూజా విధులలో నిషేధంఇక ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.

• ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంకూడా నశించును.

• రుద్రాక్షలు ధరించేవారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి,మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.

స్త్రీలకి నిషిద్ధకర్మలు :

• స్త్రీలు తులసీదళాలు తుంచ రాదు. పురుషులు మాత్రమే తుంచ వలెను.

• పౌర్ణమి, అమావాస్యనాడు,రవి సంక్రమణ, తైలాభ్యంగనస్నానం చేసిననాడు.త్రిసంధ్యలకాలంలో, మైలరోజులలో  రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా తులసిని తుంచడం మహాపాపం.అలా చేయడం అంటే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు శిరస్సునే తుంచినట్లే.

• స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు.

• స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం.

• బయటకి వెళుతున్నపుడు స్త్రీ జుట్టు విరబోసుకుని కనపడితే వెనక్కి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని కొంచం సేపు కుర్చుని వెళ్ళాలి.

• స్త్రీలు తాటంకాలు (చెవి దిద్దులు) లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం.

పురుషులకి నిషిద్ధకర్మలు :

• ధర్మపత్ని జీవించి ఉండగా పురుషుడు పరస్త్రీ సంగమం చేయరాదు అలాచేస్తే, సంవత్సరం పాటు వెళ్ళిన ఇంటికి వెళ్ళకుండా వెళ్లి తను చేసిన తప్పు చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు వేసిన భిక్షమాత్రమే స్వీకరిస్తూ జీవించాలి.

• పూర్తిగా శిరోముండనం చేసుకోకూడదు కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.పూర్తిగా శిరోముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు.

• ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా,సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదులయందు, వ్రత దినములయందు, శ్రాద్ధ దినముల యందు,మంగళ, శనివారముల యందు క్షారకర్మ (తల వెంట్రుకలు) తీయరాదు, పనికిరాదు.

Post a Comment

0 Comments