కొన్ని రైల్వే స్టేషన్ పేర్లకు చివర ‘రోడ్డు ‘అనే పదం ఉంటుంది.. దాని అర్థమేంటో తెలుసా..?
మనం రోడ్డుపై వెళ్తుంటే రోడ్డు పక్కన కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి. వాటికి చాలా అర్థాలు ఉన్నాయి. .కానీ మనకు అవి పెద్దగా ఐడియా ఉండదు.. అంతెందుకు మైలురాయిపైన వాడే రంగులకు కూడా అర్థాలు ఉన్నాయి.. ఒక్కో రంగు ఒక్కో దానికి సంకేతం..అయితే మీరు రైలులో ప్రయాణిస్తుంటే చూసారో లేదో కానీ.. కొన్ని నేమ్ బోర్డులు విచిత్రంగా ఉంటాయి. వీటన్నింటికీ వెనుక సమాచారం ఉంటుంది. కొన్ని రైల్వేస్టేషన్ల పేరు వెనుక రోడ్డు అనే పదాన్ని యాడ్ చూసి ఉంటారు.. అయితే వాస్తవానికి ఆ స్టేషన్‌కు అసలు రోడ్డు అనే పదం కానీ, ప్రత్యేకమైన రోడ్డుతో ఎలాంటి సంబంధం కానీ ఉండదు. ఇలాంటి స్టేషన్ల పేర్లకు ఈ పదాన్ని ఎందుకు చేర్చారనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా..
స్టేషన్ పేరుకు చివర ‘రోడ్డు’ అనే పదం ఉంటే.. ఏంటి అర్థం అంటే.. రోడ్డు అనే పదం ఉన్న రైల్వే స్టేషన్ నగరం నుంచి చాలా దూరంలో ఉంటుంది.. అక్కడికి చేరుకోవడానికి రోడ్డు సహాయం తీసుకోవాలి. మరో మాటలో చెప్పాలంటే, రైల్వే స్టేషన్ దాని పేరుకు రోడ్డు అనే పదం జతచేసి ఉంటే, ప్రధాన నగరానికి అనేక కిలోమీటర్ల దూరంలో నిర్మించారని అర్థం. రైల్వే స్టేషన్‌తో ముడిపడి ఉన్న ‘రోడ్’ అనే పదంతో, ఆ రైల్వే స్టేషన్ నుంచి ఆ నగరానికి వెళ్లడానికి ఒక రహదారి వెళుతుందని స్పష్టంగా తెలియజేసేందుకు గుర్తుగా కూడా ఇలా పేర్లు పట్టారంట. రైల్వే అధికారుల ప్రకారం, స్టేషన్ చివరన రోడ్డు అనే పదం ఉన్న ప్రధాన నగరం నుంచి 3 కి.మీ నుంచి 100 కి.మీ వరకు ఉంటుంది.
రోడ్డు అనే పదం ఉన్న రైల్వేస్టేషన్లు:
కడైకెనాల్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి కొడైకెనాల్ నగరానికి దూరం దాదాపు 80 కి.మీ. ఉంటుంది.. వసాయి రోడ్ రైల్వే స్టేషన్ నుంచి వసాయి ప్రాంతం దూరం కేవలం 3 కి.మీ. రాంచీ నగరం రాంచీ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి 49 కిమీ దూరంలో, హజారీబాగ్ నగరం హజారీబాగ్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి 66 కిమీ దూరంలో ఉంది. మన దగ్గర కూడా ఇలాంటి పేర్లు చాలానే ఉన్నాయి. భధ్రాచలం రోడ్డు స్టేషన్ నుంచి భద్రాచలం పట్టణం 40 కి.మీల దూరం ఉంది.
అసలు ఎందుకు అంత దూరంలో నిర్మించారు..?
దేశంలో అనేక ప్రదేశాలలో భారతీయ రైల్వేలు రైల్వే లైన్ వేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిని నివారించడానికి, ప్రధాన నగరానికి దూరంగా రైల్వే స్టేషన్లను నిర్మించారు. ఉదాహరణకు, భారతీయ రైల్వేలు మౌంట్ అబూ పర్వతంపై ట్రాక్‌ను వేయడం చాలా ఖరీదు. దీని తరువాత, అబూ నుంచి 27 కి.మీ దూరంలో పర్వతం కింద రైల్వే స్టేషన్ నిర్మించారు. ఆ స్టేషన్‌కి మౌంట్ అబూ రోడ్ రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. చాలా చోట్ల రైళ్లు వాటి రూట్‌లను సరిగ్గా అమర్చలేకపోవడం వల్ల రైళ్లు ప్రధాన నగరాలకు దూరంగానే ఆగిపోతున్నాయి.
0 Comments