GET MORE DETAILS

నీరసం ఇలా దూరం: అలసట, నీరసం క్షణాల్లో తగ్గాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

నీరసం ఇలా దూరం: అలసట, నీరసం క్షణాల్లో తగ్గాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!



పోషకలోపం, శారీరక వ్యాయామం లోపించడం, జీవనశైలి అదుపు తప్పడం లాంటి కారణాల వల్ల నిస్సత్తువ వేధించవచ్చు. కాబట్టి నిరంతరంగా నీరసం వేధిస్తుంటే ఈ కింది అంశాలను గమనించుకోవాలి.

ఆహారం ఇలా: శక్తిని అందించే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం అరటిపండ్లు, బ్రౌన్ రైస్, చేపలు, చిలగడ దుంపలు, గుడ్లు, ఓట్స్, క్వినోవా, అవకాడోలను ఆహారంలో చేర్చుకోవాలి.

వ్యాయామం: వ్యాయామంతో శరీరం, మనసు చలాకీగా మారతాయి. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.

ప్రొటీన్: ప్రొటీన్ అధికంగా పదార్థాలను స్నాక్స్ గా తీసుకోవాలి. ఇందుకోసం యాపిల్, పీనట్ బటర్, ఉడకబెట్టిన గుడ్లు, పాప్కార్న్, వేయించిన శనగలు తినాలి.

సంగీతం: శ్రావ్యమైన సంగీతంలో శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని చలాకీగా ఉంచడానికి తోడ్పడతాయి. కాబట్టి రోజులో కొంత సేపు నచ్చిన సంగీతం వినాలి.

చల్ల నీళ్ల స్నానం: చల్లదనం కండరాలను బలపరుస్తుంది. మెటబాలిజంను పెంచుతుంది. కాబట్టి చల్లనీటితో స్నానం చేస్తూ ఉండాలి.

నవ్వడం: నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే నిస్సత్తువ కూడా దూరమవుతుంది. అందుకోసం స్నేహితులతో సరదా సమయం గడపడం, పిల్లలతో ఆడుకోవడం, కామెడీ సినిమాలు, షోలు చూడడం చేయాలి.

నీళ్లు: సరిపడా నీళ్లు తాగకపోయినా నిస్సత్తువ వేధిస్తుంది. కాబట్టి రోజులో రెండు నుంచి మూడు లీటర్లకు సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.

వాసనలు: పెప్పర్మెంట్, దాల్చిన చెక్క, నిమ్మ, రోజ్మేరీ ఎసెన్షియల్ నూనెలను డిప్యూజర్ లో వేసి వాసనలు పీల్చడం వల్ల ఫలితం ఉంటుంది.

నిద్ర: 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. నిద్రలేమి బడలికను కలిగిస్తుంది.

విటమిన్ డి: విటమిన్ డి లోపం కూడా నిస్సత్తువకు కారణమే! కాబట్టి వైద్యుల సలహా మేరకు డి విటమిన్ లోపాన్ని పరీక్షించుకుని సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి. అలాగే, ఉదయం, సాయంకాలపు నీరెండలో కనీసం 15 నిమిషాల పాటైనా గడుపుతూ ఉండాలి.

Post a Comment

0 Comments