GET MORE DETAILS

హక్కుల ప్రదాత (నేడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వర్థంతి)

హక్కుల ప్రదాత (నేడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వర్థంతి)



యమ్.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

ఐ హేవ్ ఎ డ్రీమ్(నాకో కల ఉంది) అంటూ 1963లో అమెరికా పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్(జూనియర్) చేసిన ప్రసంగాన్ని చాలామంది వినే ఉంటారు.ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని కదిలించిన, అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని మలుపుతిప్పిన ప్రసంగం.ఆఫ్రికన్- అమెరికన్ అయిన లూథర్ కింగ్ అమెరికాలో నల్లజాతీయుల పట్ల వర్ణవివక్ష ఎంతగా ఉందో బాల్యం నుంచే స్వయంగా అనుభవించారు.

వివక్షత అనేది ప్రపంచంలో ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంది.మనదేశంలో అంటరానితనం రూపంలో, అమెరికా,దక్షిణ ఆఫ్రికా వంటి దేశాల్లో వర్ణ వివక్ష రూపంలో ఉంది. ఇండియాలో పూలే, అంబేద్కర్ తదితరులు అంటరానితనం నిర్మూలన కోసం. విశేష కృషి చేశారు.ఇతర దేశాలలో వంగరి మతాయి,మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వంగరి మతాయి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు.

అమెరికా గాంధీగా పేరు పొందిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్  1929 జనవరి15న జన్మించారు. వర్ణవివక్షతపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచదేశాల్లోనివిద్యావంతులను, మానవతావాదులను, ప్రభుత్వాలను కదిలించాయి. అనేక పోరాటాలకు ఆయన ప్రసంగాలు ఊతమిచ్చాయనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని కదిలించిన, అమెరికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని మలుపుతిప్పిన ప్రసంగాలెన్నో ఉన్నాయి. ఆఫ్రికన్- అమెరికన్ అయిన లూథర్ కింగ్ అమెరికాలో నల్లజాతీయుల పట్ల వర్ణవివక్ష ఎంతగా ఉందో బాల్యం నుంచే స్వయంగా అనుభవించారు. ఓ రోజు తెల్లజాతీయుడికి బస్సులో సీటు ఇవ్వలేదన్న కారణంతో ఆఫ్రికన్- అమెరికన్ మహిళను అరెస్టు చేశారు.

దానికి స్పందించిన లూథర్ కింగ్, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా భారీ ఉద్యమంప్రారంభించారు. అమెరికా ప్రభుత్వం దిగివచ్చి చట్టాన్ని తీసుకొచ్చేలా చేశారు. చివరికి ఆయన్ను హత్య చేశారు.

లూథర్ కింగ్‌ ముఖ్య ఉద్దేశం అమెరికాలో పౌర హక్కులను కాపాడడంలో అభివృద్ధి సాధించడం. 1955 మాంట్‌గొమరీ బస్సు నిరసనకు ప్రాతినిధ్యం వహించారు,, సదరన్ క్రిస్టియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ 1957లో స్థాపించుటకు తోడ్పడ్డారు. ఈ సంస్థకు ఇతను మొదటి అధ్యక్షుడు.1963 లో వాషింగ్టన్ పై ప్రదర్శన సాగించాడు, ఇక్కడే లింకన్ మెమోరియల్ మెట్లపై ప్రసిద్ధి చెందిన "నాకూ ఒక కల వున్నది" అనే ప్రసంగం సాగించారు. ప్రజలలో పౌరహక్కుల గురించి చైతన్యం కల్పించారు. తద్వారా తాను మంచి వక్తగా, సాంఘిక సంస్కర్తగా అమెరికాలో చరిత్ర సృష్టించారు. 1964 లో అతి చిన్న వయస్సులో నోబెల్ పురస్కారం పొందిన వ్యక్తిగా ఖ్యాతినార్జించారు.ఇతనికి ఈ పురస్కారం తన రేషియల్ సెగ్రిగేషన్, జాతివాదం జాతి వివక్ష లపై వ్యతిరేకంగా సాగించిన కృషికి, ఆ కృషిలో అవలంబించిన పౌర నిరాకరణ, అహింస వంటి శాంతియుత పద్ధతులకు గాను లభించింది. 

1968లో తన మరణించే కొద్దికాలానికి ముందు వరకు పేదరిక నిర్మూలన కొరకు పాటుపడ్డారు,, వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పాడు, అందులోనూ మతపరమైన దృష్టితో విమర్శించాడు. 1968 ఏప్రిల్ 4 న మెంఫిస్ లో హత్య గావింపబడ్డారు. ఇతని మరణాంతరం ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడమ్ 1977లోనూ,, కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ 2004లోనూ ప్రసాదింపబడింది.బానిసత్వ నిర్మూలనకు లింకన్ ఒక అడుగు ముందుకు వేస్తే,నల్ల జాతీయుల హక్కుల కోసం లూథర్ కింగ్ ఏకంగా తన ప్రాణాలనే అర్పించారు.

Post a Comment

0 Comments