GET MORE DETAILS

దేవాలయములో శఠగోపం అయ్యాక కాసేపు ఆలయములో కూర్చొవాలని పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకు కూర్చోవాలి?

దేవాలయములో శఠగోపం అయ్యాక కాసేపు ఆలయములో కూర్చొవాలని పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకు కూర్చోవాలి?



ఆలయానికి వెళ్లి పూజలు చేయడం, దేవున్ని దర్శించుకోవడం చాలామందికి అలవాటే. కానీ కొంతమంది భక్తులు దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోనే కాసేపు కూర్చుంటారు. ప్రసాదాలను కూడా అక్కడే ఆరగిస్తారు. అయితే స్వామి దర్శనమూ, శఠగోపం అయ్యాక కాసేపు దేవాలయములో కూర్చొవాలని పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకు కూర్చోవాలి.

సాదారణంగా మనం దేవాలయంలో దైవ దర్శనం అయ్యాక కొంచెం సేపు కూర్చుంటాం. ఈ విధంగా ఎందుకు కుర్చుంటామో చాలా మందికి తెలియదు. అయితే కొంతమంది దైవ దర్శనం కాగానే హడావిడిగా వెళ్లి పోతూ ఉంటారు. నిజానికి దైవ దర్శనం అయ్యాక గుడిలో కొంచెం సేపు కూర్చోవాలని మన శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఇప్పుడు దర్శనం అయ్యాక గుడిలో కూర్చోవటానికి గల శాస్త్రీయమైన కారణాలను తెలుసుకుందాం. 

గుడిలో దేవుని దర్శనం అయ్యాక మనస్సు, శరీరం ఉత్తేజితం అవుతుంది. గుడిలో దేవుని మహిమ, మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడుతుంది. గుడి ప్రదేశాల్లో విద్యుత్, అయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పాజిటివ్ శక్తి విరివిరిగా లభ్యం అయ్యే ప్రదేశల్లోనే దేవాలయాలను నిర్మిస్తారు. ఈ ప్రదేశ కేంద్ర స్థానంలో మూల విరాట్‌ను ప్రతిష్ట చేస్తారు. ఈ ప్రదేశాన్ని మూల స్థానం అంటారు. ఈ మూల స్థానంలో భూమి అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దర్శనం తర్వాత ఆలయంలో కూర్చుంటే చిరాకులు తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. చెడు ఆలోచనలు తొలగి.. మంచి మార్గంలో పయణించడానికి దోహదపడుతుంది.

గుడి ప్రదేశాల్లో విధ్యుత్,అయస్కాంత శక్తీ క్షేత్రాల తరంగాల పరిది ఎక్కువుగా ఉంటుంది. ఇటువంటి పాజిటివ్ శక్తి విరివిరిగా లభ్యం అయ్యే ప్రదేశంలో దేవాలయాలను నిర్మిస్తారు. ఈ ప్రదేశం యొక్క కేంద్ర స్థానంలో మూల విరాట్ ను ప్రతిష్ట చేస్తారు. ఈ ప్రదేశాన్ని మూల స్థానం అంటారు. ఈ మూల స్థానంలో భూమి యొక్క అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి. మూల విరాట్ అడుగు బాగంలో వేద మంత్రాలను రాసిన రేగి రేకులను ఉంచుతారు. ఈ రాగి రేకులు భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించి చుట్టూ పక్కలకు ప్రసారం చేస్తాయి. 

రేకులు ప్రతి రోజు గుడికి వచ్చి సవ్య దిశలో ప్రదిక్షణలను చేస్తే, ఆ వ్యక్తి యొక్క శరీరం మూల విరాట్ అడుగున ఉన్న రాగి రేకులు ప్రసారం చేసే అయస్కాంత తరంగాలను గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ చాలా నిదానంగా జరుగుతుంది. అందువల్ల మన పెద్దవారు ప్రదిక్షణ చేసే సమయంలో నిదానంగా, ప్రశాంతంగా చేయాలనీ చెప్పుతూ ఉంటారు. ఈ ధనాత్మక శక్తి మనం ఆరోగ్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. గుడిలో దేవుని దర్శనం అయ్యాక మనస్సు,శరీరం ఉత్తేజితం అవుతుంది. అవుతుంది. గుడిలో దేవుని మహిమ,మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడుతుంది. 

అలాగే చెడు ఆలోచనలు కలగకుండా మంచి నిర్ణయాలు తీసుకొనే విధంగా ప్రోత్సాహం కలుగుతుంది. దైవ సన్నిదిలో మంత్ర జపం లేదా ధ్యానం చేస్తే జ్ఞాపకశక్తి మెరుగు అయ్యి రెట్టింపు పలితాలను పొందుతాం. అందువల్ల దైవ దర్శనం అయ్యాక దేవాలయంలో కొంచెం సేపు కూర్చుంటే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

స్వామి దర్శనం అయ్యాక దైవ సన్నిధిలో కాసేపు కూర్చుంటే మనసుకి ప్రశాంతత కలగడంతో పాటు.. పుణ్యం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలా కూర్చోకుండా వెళితే స్వామిని దర్శించిన ఫలం కూడా రాదట. గుడిలో కూర్చున్నప్పుడు మంచి చెడులు బేరీజు వేసుకుంటాము, ప్రశాంత మనసుతో ఆలోచిస్తాం. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచనలో పడుతాం. రోజు వారి జీవన విధానాన్ని సరిచేసుకుని సరైన మార్గంలో నడుస్తాము. గుడిలో కూర్చోవటం ఒక రకమైన ధ్యాన పద్ధతి కూడా.

Post a Comment

0 Comments