GET MORE DETAILS

తీహార్ జైలు ఎక్కడ ఉందో మీకు తెలుసా...?

తీహార్ జైలు ఎక్కడ ఉందో మీకు తెలుసా...?



లిక్కర్ స్కాం కేసులో అరెస్టు ఐన కవిత, కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించడంతో ఒక్కసారిగా ఈ జైలు పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ తీహార్ జైలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భారత దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో ఉన్న చాణిక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీహార్ అనే గ్రామంలో ఈ జైలు ఉంది. ఈ జైలును 1957 లో ప్రారంభించారు.దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద కారాగార ప్రాంగణము ఉన్న  జైలు ఈ తీహార్ జైలు. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో తీహార్ జైలును నిర్మించారు. ఈ జైలులో 6251 మంది ఖైదీలకు  సరిపోయే వసతులు ఉన్నాయి.

ఈ తీహార్ జైలులో పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురు ను ఉరి తీశారు. అలాగే ఇందిరాగాంధీ హత్య కేసులో కేహార్ సింగ్, సత్వంత్ సింగ్ లను కూడా ఈ జైలులోనే ఉరి తీశారు.1986 మార్చి 16న క్రిమినల్ చార్లెస్ సోబ్రాజ్ ఇదే జైలు నుంచి తప్పించుకొని వెళ్లి పోయాడు.

ముఖ్య మంత్రులు,మాజీ కేంద్ర మంత్రులు, ప్రముఖులు సంజయ్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, ఏ.రాజా, కనిమొళి, వినోద్ గోయంకా, సురేష్ కల్మాడి, అమర్ సింగ్, అన్నాహజారే, ఓం ప్రకాష్ చౌతాలా, మిల్కా సింగ్, సంజయ్ దత్ లును ఈ తీహార్ జైలులోనే రిమాండ్ విధించారు.

Post a Comment

0 Comments