GET MORE DETAILS

హై కొలస్ట్రాల్ తో వెంటాడే కష్టాలు

 హై కొలస్ట్రాల్ తో వెంటాడే కష్టాలు



• తినే ఆహారంలో ఎంతో కొంత కొవ్వు పదార్ధాలు ఉండాల్సిందే కానీ, అధిక మొత్తంలో వీటిని తీసుకోవటం వల్ల గుండెపోటు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అధిక కొవ్వు పదార్థాలు గల ఆహారాలను తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

• శరీరానికి కొద్ది మొత్తంలో కొవ్వు పదార్థాలు అవసరమే... అయితే కొన్ని ప్రత్యేక కొవ్వు పదార్థాలు శరీరంలో కొవ్వు స్థాయిలను పెంచి, హృదయ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి. తినే ఆహార పదార్థాలలో ఇలాంటి వాటిని తొలగించి, అన్-సాచురేటేడ్ కొవ్వు పదార్థాలున్న ఆహారాలను ఎంచుకోవాలి. అధిక కొవ్వు పదార్దాలుండే ఆహార ప్రణాళిక వల్ల ఊబకాయం కలుగుతుంది. దీంతో అనేక వ్యాధులకు గురవ్వాల్సి ఉంటుంది.

• అధిక కొవ్వు పదార్ధాలతోగల ఆహార ప్రణాళిక వాసన వంటి ఘ్రాణ జ్ఞానవ్యవస్థని ప్రభావితం చేస్తుంది. సహజమైన వాసనలను గ్రహించే స్థితిని దెబ్బతీస్తుంది.

• అధిక కొవ్వు ఉండే ఆహార పదార్థాలు హృదయానికి మాత్రమే కీడు కలిగించవు. అవి మెదడునూ ప్రభావితం చేస్తాయి. ఆంత్రంలో బ్యాక్టీరియాను ప్రభావితం చేసి, మన ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తాయి. ఉద్రేకత వంటి మానసిక సమస్యలకు గురిచేస్తాయి.

• అధిక కొవ్వుండే ఆహార పదార్థాలు, ఊబకాయం రెండూ ఒకదానికి ఒకటి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి. దీనివల్ల మధుమేహవ్యాధి కలిగే అవకాశం ఉంది. అధిక కొవ్వు పదార్థాల స్థాయిలు మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని కష్టతరం చేసి, రక్తపోటు స్థాయిని ప్రభావితం చేస్తాయి.

• అధిక కొవ్వు గల ఆహారాలు పిల్లలలో డోపమైన్ ను ప్రభావితం చేసి, వారిలో ప్రవర్తన, నేర్చుకునే అంశాల్లో సమస్యలకు కారణమవుతాయి. పిల్లలలో కలిగే 'ఆటెన్షన్ డిఫిసిట్ హైపర్యాక్టివిటి డిసార్డర్'కు వారు తినే అనారోగ్యకర ఆహార పదార్థాలకు ప్రత్యక్ష సంబంధం ఉంది.

Post a Comment

0 Comments