GET MORE DETAILS

అరటి పండు పెరుగుదల న్యూటన్ కే అర్ధం కానిది

 అరటి పండు పెరుగుదల న్యూటన్ కే అర్ధం కానిది.



అరటి పండు పెరుగుదల ప్రకృతి ధర్మానికి విరుద్ధమని మీకుతెలుసా ..? అరటి పండు వంపు తిరిగి ఉండడానికి కారణమేమిటో తెలుసా..?  సృష్టిలో భూమ్యాకర్షణ ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా పెరిగేది అరటి పండు.. పురాణగాధల్లో అరటిపండు సూర్యుడికి నమస్కారంచేస్తూ పెరుగుతుంది అంటారు. మిగిలిన పండ్లు భూమి దిశగా పెరుగుతాయి అంటారు. అరటిగెల కిందకు చూసినా, అరటి కాయమాత్రం పైకే పెరుగుతుంది. దీన్నీ సాంకేతిక భాషలో నెగెటివ్ జియో ట్రాపిజం అంటారు. జియో ట్రాపిజం అంటే ఏదైనా కాయలు, లేదా పండ్లు భూమ్యాకర్షణ వైపుగా పెరడం. దీన్ని పాజిటివ్ ట్రాపిజం అంటారు. అరటికాయలు గెలపై పైకి పెదగడాన్ని నెగెటివ్ జియో ట్రాపిజం అంటారు.. సృష్టిలో అతికొద్ది కాయల్లోనే ఇది సాధ్యం అవుతుంది. అదే ప్రకృతి రహస్యం. సృష్టి మానవాళికి ఇచ్చిన అతిగొప్ప పోషక విలువలున్న పళ్లలో అరటిపండు ఒకటి. ప్రపంచంలో ధాన్యం, గోధుమలు , మొక్కజొన్న తరువాత అతిపెద్ద పంట అరటి పంట. ఏడాదికి వంద బిలియన్ల అరటి పళ్ళు పండుతాయి. మానసికవత్తిడిని తగ్గించే రసాయనం ఇందులోఉంది. మెగ్నీషియం , పొటాషియం, విటమిన్, బి -6, విటమిన్ - సి , అమినో యాసిడ్స్ లాంటి రసాయనాలు పుష్కలంగా ఉన్న అరటిపండు ఆరోగ్యవరప్రదాయిని.

Post a Comment

0 Comments