GET MORE DETAILS

మౌడ్యమి (మూఢమి) - సమగ్ర పరిశీలన

 మౌడ్యమి (మూఢమి) - సమగ్ర పరిశీలన 

శుక్ర మూఢమి 26-04-2024 న శుక్ర మూఢమి ప్రారంభమై 01-07-2024 న శుక్ర మూఢమి త్యాగం జరుగును.

గురు మూఢమి 05-05-2024 న గురు మూఢమి ప్రారంభమై 03-06-2024 న గురు మూఢమి త్యాగం జరుగును.



ప్రతి గ్రహం రవికి 12 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి. ఆ గ్రహాం తన కారకత్వాలను కోల్పోవుతుంది. ఆ గ్రహాం కోల్పోయిన బలాన్ని రవి స్వీకరిస్తాడు.

ఆ గ్రహాం యొక్క కారకత్వాలను రవి తన మహాదశలలో ఇస్తాడు. ఏగ్రహాం అయితే అస్తంగత్వం చెందుతుందో ఆగ్రహాం ఏకారకత్వాలను తెలియజేస్తాయో ఆ కార్యక్రమాలను చేయకూడదు.

కుజుడు: కుజుడు అస్తంగత్వం చెందినప్పుడు ఆపరేషన్స్, యుద్ధాలు, రక్షణ సంభంధ నిర్ణయాల, పోలీస్ ఉద్యోగంలో చేరుట ఇంకా కుజగ్రహానికి సంబందించిన మొదలగు పనులు చేయకూడదు.

బుధ,శుక్ర మూడమిలలో అన్నప్రాశన తరువాత కార్యక్రమాలు చేయరాదు. అన్నప్రాశన ముందు కార్యక్రమాలు చేసుకోవచ్చును.

గురువు: గురువు మూడమిలలో సుఖానికి, దనానికి,సంబందం లేని పనులు చేసుకోవచ్చు, గురువు అస్తంగత్వం చెందినప్పుడు ఉపనయనం చేయటం మంచిది కాదు.

శని: శని అస్తంగత్వం చెందినప్పుడు ఉపాసన, దీక్ష, తపస్సు, మెడిటేషన్ వంటి పనులు చేయరాదు.

మూడమి అన్ని గ్రహాలకు ఉన్న గురు, శుక్ర మౌడ్యమి మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది.

ఈ మూడమిలో జప, హోమాది శాంతులు గ్రహా శాంతికి అభిషేకాలు గండనక్షత్ర శాంతులు అన్ని వ్రతాలు చేయవచ్చును.

శుక్ర మూఢమి:

బుధుడు, శుక్రుడు భూకక్ష్యకు లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ బుధ శుక్రులు భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యుని యొక్క అవతలి వైపుకి వెళ్ళినప్పుడు భూమి పైన ఉన్న మనకు బుధ, శుక్రులు కనిపించారు. అట్టి సమయాన్నే బుధ అస్తంగత్వం, శుక్ర అస్తంగత్వం అంటారు. శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్ర మౌడ్యమి అంటారు.

శుక్రుడు సూర్యునికి అవతలి వైపునకు వెళ్ళినప్పుడు “ప్రాక్ అస్తంగత్వం” అని, శుక్రుడు సూర్యునికి భూమికి మద్య అస్తంగత్వం అయినప్పుడు పశ్చాద అస్తంగత్వం అంటారు. మౌడ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌడ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.

శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము. మౌఢ్యమిని మూఢమిగా వాడుక భాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు. మూఢమి అంటే చీకటి. శుక్రుడు సూర్య గ్రహమునకు ముందూ, వెనుక 10 డిగ్రీల దూరము లోపు శుక్రుడన్నట్లయితే అస్తంగత్వమునకు గురి అవును. అనగా శుక్రుడు తన తేజస్సును, ప్రభావాన్ని, శుభత్వాన్ని కోల్పోవును. అందువల్ల ఆ కాలములో చేసే శుభకార్యాలకు శుభ గ్రహమైన శుక్ర బలం ఉండదు కాబట్టి శుభ కార్యాలు చేయరాదు. కాబట్టి నిషేథ కాలముగా పరిగణించారు. అలాగే ముఖ్యముగా పెళ్ళిచూపులు, వివాహ, చేయరాదు, వాహన కొనుగోలు చేయరాదు.

శుక్ర మౌఢ్యమి ఏర్పడినప్పుడు సమస్త జీవకోటి శృంగార సంబంథమైన విషయాల్లో బలహీనత ఏర్పడుతుంది. వీర్యకణాలలో జీవత్వం, పటుత్వం ఉండదు. శుక్రమౌఢ్యమి కాలంలో ప్రసవం జరిగినప్పుడు శుక్ర గ్రహ, రవిగ్రహ శాంతి చేయాలి. శుక్రదశ మహా దశ మరియు శుక్రుని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు చాలా జాగరూకులై ఉండాలి. శుక్ర మౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు, పోటులలో మార్పులు వస్తాయి.

శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి –శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బలహీనముగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదు.. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.

Post a Comment

0 Comments