GET MORE DETAILS

నిద్ర ప్రాముఖ్యత ఏమిటి ? జీవితంలో నిద్ర యొక్క విధులు ఏమిటి...?

నిద్ర ప్రాముఖ్యత ఏమిటి ? జీవితంలో నిద్ర యొక్క విధులు ఏమిటి...?

     


నిద్రలేమి సమస్య ఈ మధ్య ఎంత కామన్ సమస్యగా మారిందంటే, అసలు ఇది సమస్యే కాదు అన్నంతగా. కానీ శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. శరీరంలోని చాలా సమస్యలకు నిద్ర మంచి మందు. సగటున రోజుకి ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోతే శరీరం ఉత్తేజంగా మారుతుంది. అలాంటి మంచి నిద్ర పట్టడానికి నేను తెలుసుకున్న కొన్ని కిటుకులు చెబుతాను.

1. రాత్రి ఎనిమిది లోపల భోజనం చేయాలి. అందులో మసాలాలు, వేపుళ్ళు, నూనె పదార్థాలు సాధ్యమైనంత వరకూ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆ వేళ భోజనాన్ని (నిజానికి ఏ వేళ భోజనాన్నైనా) బాగా నమిలి తినాలి. తద్వారా మెదడుకు దాన్ని అరిగించడానికి సమయం తక్కువ పట్టి త్వరగా నిద్ర వైపు మళ్ళుతుంది.

2. పడుకునే కనీసం గంట ముందైనా ఎలక్ట్రానిక్ తెరలను చూడటం మానేయాలి. కారణం, ఆ తెరల నుండి వెలువడే కిరణాలు కళ్ళలో కొన్ని హార్మోన్లను ఉత్తేజపరుస్తాయి. అవి ఇంకా నిద్ర సమయం అవ్వలేదన్న సంకేతాన్ని మెదడుకి పంపుతాయి. ప్రత్యామ్నాయంగా ఆ సమయంలో ఓ పుస్తకం పట్టుకోవచ్చు లేదా మీకు నచ్చిన సంగీతాన్ని వినవచ్చు (కళ్ళు మూసుకొని).

3. నిద్ర సమయానికి గంట ముందే తగిన మంచినీరు త్రాగాలి. చాలామంది పడుకునే ముందు అధికంగా నీరు త్రాగుతారు. అది చాలా తప్పు. నీరు ఎప్పుడూ శరీరంలోని సెల్సుని ఉత్తేజపరుస్తుంది (అందుకే ఉదయాన లేవగానే నీరు త్రాగమని చెబుతారు). తద్వారా నిద్రపట్టే సమయం మరింత వెనక్కి జరుగుతుంది.

4. పడుకునే గదిని వీలైనంత చీకటిగా ఉండేలా చూసుకోవాలి. బెడ్ లైట్స్ వంటివి వేసుకోరాదు. ఇది కష్టమైతే స్లీపింగ్ మాస్క్   వాడొచ్చు.

5. పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయవచ్చు. ఎక్కువ వేడి పోసుకున్నా నిద్రపట్టదు.

6. పరుపు మీదే కాసేపు ధ్యానముద్రలో కూర్చొని ధ్యానం చేసుకున్నా కాసేపటికి నిద్ర పట్టేస్తుంది.

7. పడుకునేటప్పుడు కుడి వైపుకి తిరిగి పడుకుంటే త్వరగా నిద్ర పడుతుంది. ఎడమ వైపు తిరిగి పడుకుంటే గుండై పైన బరువు పెరుగుతుంది.

8. చివరగా, ఉత్తర దిక్కుకి తల పెట్టుకొని పడుకోకూడదు. హిందూ ధర్మం ప్రకారం దక్షిణ దిక్పాలకుడు ‘యముడు’ కనుక ఉదయాన లేవగానే అతడిని దర్శించుకున్నట్టు ఉంటుందని చెబుతారు. దీని వెనుక నేను తెలుసుకున్న సైంటిఫిక్ కారణం కూడా ఉంది. భూమికున్న ఆకర్షణ శక్తి ఎప్పుడూ ఉత్తరం మరియు దక్షిణం వైపులకి పని చేస్తుంటుంది. తద్వారా భూమధ్యరేఖకు పైనున్న భూభాగం ఉత్తరం వైపుగా, దాని క్రిందున్న భూభాగం దక్షిణం వైపుకి ఆకర్షించబడుతుంటాయి. (భారతదేశం ప్రతి సంవత్సరం ఓ సెంటిమీటరు పాటు కుంచించుకుపోతుంది). 

ఈ జియోగ్రఫీకి, నిద్రకు ఓ సంబంధముంది. మానవ శరీరంలో క్రింది భాగంలోని రక్తనాళాలు వెడల్పుగా ఉంటాయి. వాటిలోంచి రక్తం ఎక్కువగా ప్రవహిస్తుంటుంది. పైకి వెళ్ళగా అవి క్రమేణా సన్నబడుతూ మెదడు దగ్గరికి వచ్చేసరికి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. 

ఉత్తరానికి తల పెట్టుకుని పడుకున్నప్పుడు భూమికున్న ఆకర్షణ శక్తి వల్ల రక్తం అధికంగా తలవైపుకి ప్రవహిస్తుంది. అక్కడ రక్తనాళాలు సన్నవిగా ఉండడం మూలాన ఒత్తిడి పెరిగి నిద్రలేమి సమస్య, కలత నిద్ర, పీడ కలలు రావడం జరుగుతుంది. అలా ఎక్కువ రోజులు ఉత్తరానికి తల పెట్టుకొని పడుకోవడం వల్ల బ్రెయిన్ హేమరేజ్ వచ్చే అవకాశం కూడ ఉంది. 

ఒక్కోసారి నిద్రలోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అంటే, లేవగానే యముడిని దర్శించుకున్నట్టే కదా!  భూమధ్యరేఖ పైనున్న దేశాల్లో ఉత్తర దిక్కుకి, భూమధ్యరేఖ క్రిందున్న దేశాలలో దక్షిణ దిక్కుకి తల పెట్టుకొని పడుకోరాదు.

Post a Comment

0 Comments