GET MORE DETAILS

ఒక్క ఓటు అని వదిలేస్తే....? చరిత్ర పుటల్లో ఆ ఒక్కఓటు పవర్...!

ఒక్క ఓటు అని వదిలేస్తే....? చరిత్ర పుటల్లో ఆ ఒక్కఓటు పవర్...!


• అధికారమే తారుమారు. 

• భవిష్యత్తు నిర్ణయించేది మీరే



మనం ప్రయాణించాల్సిన బస్సు, రైలో తప్పిపోతే కాస్త ఆలస్యమైనా గమ్యస్థానం చేరుకోవచ్చు. అదే ఓటు వేయకపోతే మళ్లీ ఐదేళ్ల దాకా ఆ అవకాశం కోల్పోయినట్లు. మనది ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురవుతాం. ఒక్క ఓటు తేడాతో ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్నాయి ప్రభుత్వాలు కూలిపోయాయి. ఎందరికో అధికారాలు దూరమయ్యాయి. చేతికి అంది వస్తాయన్న అవకాశాలు రాకుండా పోయాయి.

ఇదిగో కొన్ని ఉదాహరణలు:

• 1999లో ఒక్క ఓటు తేడాతో వాజ్ పాయ్  అధికారం కోల్పోయాడు

• ఒక్క ఓటు తేడాతో ఆంగ్లంపై గెలిచి హిందీ మన దేశ జాతీయ బాషగా గుర్తింపు పొందింది.

• 2008లో రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సీపీజోషి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి పదవి వరించేది.

• 1576లో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మన్ క్కు బదులుగా ఇంగ్లీషు అధి కార బాష అయింది. 

• 1714లో ఓక్క ఓటు తేడాతో చింగాజార్జ్వన్ ఇంగ్లాండులో పీటమెక్కాడు. 

• 1800లో థామస్ జాప్సర్సన్, 1824లో జాన్స్వీన్ ఆడమ్స్, 1876లో రూథర్ఫర్డ్ జేమ్స్ ఎలక్టర్ కాలేజ్లో ఒకే ఒక్క ఓటు తేడాతో అమెరికా అధ్యక్షులుగా పదవులు అలంకరించారు.

• 1923 నవంబరు 8న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు తేడాతో ఆడాలాహిట్లర్ ప్రత్యర్థి ఓడిపోయాడు. లేదంటే ప్రపంచ చరిత్ర మరో విధంగా ఉండేదేమో. 

మీకున్న ఒక్క ఓటుకు అంతటిశక్తి ఉందేమో. నీ ఒక్క ఓటే సంచలనం సృష్టించ వచ్చు. అభివృద్ధి చేసేవారికి ఓటు వేయండి మీ భవిష్యత్తును మీరే మార్చుకోండి.

Post a Comment

0 Comments