GET MORE DETAILS

దేశానికి నౌకా బలం (డిసెంబర్ 4 జాతీయ నౌకా దళ దినోత్సవం)

దేశానికి నౌకా బలం (డిసెంబర్ 4 జాతీయ నౌకా దళ దినోత్సవం)



యం.రాం ప్రదీప్

జేవివి సభ్యులు, తిరువూరు

9492712836


5,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న భారతదేశంలో కీస్తు పూర్వం, 2300లో ప్రస్తుత గుజరాత్‌లోని మంగ్రోల్ దగ్గర మొట్టమొదటి నౌకాతీరం నిర్మించబడింది. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యంలో మొదటిసారి నౌకా విభాగాన్ని ఏర్పరిచారు. చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి అయిన చాణక్యుడు తాను రచించిన అర్థశాస్త్రంలో 'నవాధ్యక్ష'  పేరుతో నదీజలాల వినియోగం గురించి నిర్దేశించాడు. చుట్టూ ఉన్న దేశాలతో రాకపోకలకు, పలు రకార సంస్కృతులకు ఈ జలదారులు ప్రధాన కారణం. భారతదేశ చరిత్రలో మౌర్య, శాతవాహన, చోళ, విజయనగర, కళింగ, మరాఠా, మొఘల్ సామ్రాజ్యాల నౌకా వ్యవస్థలు పేరెన్నికగన్నవి.

బ్రిటీషు ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నపుడు ది బ్రిటీష్ ఇండియన్ నేవీని ఏర్పరిచారు. ఇది 1946 నాటికి 78 ఓడలు 2,000 సిబ్బంది కలిగి ఉండేది. జనవరి 26, 1950న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా, వాహకాలకు ఇండియన్ నావల్ షిప్స్ గా పేరు పెట్టారు.

1971లో పాకిస్తాన్ నౌకాదళ ప్రధాన కార్యాలయం కరాచీలో ఉండేది. పాకిస్తాన్ నౌకాదళం దాదాపు పూర్తిగా కరాచీ హార్బరులోనే ఉండేది. పాకిస్తాన్ నౌకావిపణికి కూడా కరాచీయే ప్రధాన స్థావరం. కరాచీ దిగ్బంధనం అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టే. కరాచీ హార్బరు సంరక్షణ పాకిస్తాన్ హైకమాండుకు అత్యంత ప్రధానం; వైమానిక, నౌకా దాడుల నుండి దానికి పటిష్ఠమైన భద్రత ఉండేది. ఈ ప్రాంతంలోని రెండు వైమానిక స్థావరాల లోని యుద్ధవిమానాల ద్వారా కూడా కరాచీకి రక్షణ కల్పించారు.

భారతనావికాదళంపాకిస్తాన్‌ రేవు పట్టణంకరాచీపై చేసిన దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు. ఈ ఆపరేషన్‌కుకొనసాగింపుగా నావికాదళం చేపట్టినదానిని  ఆపరేషన్ పైథాన్ అంటారు. నౌకా విధ్వంసక క్షిపణులను వాడిన తొలి యుద్ధం ఈ ప్రాంతంలో ఇదే. డిసెంబరు 4-5 రాత్రి చేపట్టిన ఈ ఆపరేషన్ పాకిస్తాన్ నౌకలు, స్థావరాలకు తీవ్ర నష్టం కలగజేసింది. పాకిస్తాన్ ఒక మైన్ స్వీపరు, ఒక డిస్ట్రాయరు, ఆయుధాలను చేరవేస్తున్న ఒక రవాణా నౌక, ఇంధన నిల్వ స్థావరాన్ని కోల్పోగా, భారత్‌కు ఏమాత్రం నష్టం కలగలేదు. పాకిస్తాన్ యొక్క మరొక డిస్ట్రాయరుకు తీవ్ర నష్టం కలగ్గా దాన్ని తరువాతి కాలంలోదళం నుండి తొలగించారు. విజయవంతమైన ఈ ఆపరేషనుకు గుర్తుగా భారత నౌకాదళం ప్రతి డిసెంబరు 4 ను నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటోంది. 

తీర సరిహద్దులను రక్షించడం, అంతర్జాతీయ సంబంధాలను విస్తరింపజేయడం, సంయుక్త సైనిక విన్యాసాల నిర్వహణ, ప్రకృతి విపత్తులు, ఇతర ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి మానవతా దృక్పథంతో కూడిన నౌకాదళ సేవలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. నేవీ డే విజయానికి గుర్తుగా నేవీ బ్యాండ్‌ బృందాల సాంస్కృతిక ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా  నిర్వహిస్తుంటారు.ఈ ఏడాది పూరి వేదికగా ఈ వేడుకలు చేస్తున్నారు.

ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భారత నౌకాదళ యోధు లనేకమందికి శౌర్య పురస్కారాలు ప్రసాదించారు. ఆపరేషన్ ప్రణాళిక రచించినందుకు, అప్పటి ఫ్లీట్ ఆపరేషన్స్ ఆఫీసరు కెప్టెన్ (తరువాతి కాలంలో వైస్ అడ్మిరల్ అయ్యారు) గులాబ్ మోహన్‌లాల్ హిరనందానికి నవసేనా మెడల్, దాడిని నిర్వహించినందుకు దాడిదళ కమాండరు యాదవ్‌కుమహావీరచక్ర, నిర్ఘాత్, నిపాత్, వీర్‌ల కమాండర్లైన లెఫ్టినెంట్ కమాండర్లు బహదూర్ నారిమన్ కవీన, ఇందర్జిత్ శర్మ, ఓంప్రకాశ్ మెహతాలకు, నిర్ఘాత్‌లోని మాస్టర్ ఛీఫ్ ఎం ఎన్ సింఘాల్‌కు వీరచక్ర బహూకరించారు.ఈ దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.

Post a Comment

0 Comments