GET MORE DETAILS

వారు దేనినైనా సాధించగలరు. వారిలోనూ ప్రతిభ ఉంది . (డిసెంబర్ 3-అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా)

 వారు దేనినైనా సాధించగలరు. వారిలోనూ ప్రతిభ ఉంది . (డిసెంబర్ 3-అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా)


యం. రాం ప్రదీప్
జెవివి సభ్యులు, తిరువూరు
9492712836

ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. సరైన సహకారం,ప్రోత్సాహం లభిస్తే, ఎవరైనా ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.

ఇందుకు అంగ వైకల్యం అడ్డు కాబోదు. స్టీఫెన్ హాకింగ్, ఎడిసన్, నిక్, సుధా చంద్రన్, హెలెన్ కెల్లర్... ఇలా ఎందరో చరిత్రలో తమకున్న వైకల్యాలను ఆత్మ విశ్వాసంతో అధిగమించి, ఉన్నత శిఖరాలని అధిరోహించారు.

దివ్యాంగులు అని అంగవైకల్యంతో బాధపడుతున్నవారిని అంటారు. గతంలో అయితే వీరిని వికలాంగులు అని పిలిచేవారు. కానీ వైకల్యం అనేది శరీరానికి తప్ప మనసుకు కాదని గ్రహించిన భారత ప్రభుత్వం వారిని విభిన్న ప్రతిభావంతులు లేదా దివ్యాంగులు అని నామకరణం చేసింది. ఎవరికి అయితే అవయవలోపం ఉంటుందో,వీరికి ప్రత్యేకంగా ఓ సర్టిఫికేట్ ను ప్రభుత్వం అందిస్తుంది.వీరికి రిజర్వేషన్ కూడా ఉంటుంది.

ఈ సంవత్సరం థీమ్  "సమగ్ర మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం వికలాంగుల నాయకత్వాన్ని విస్తరించడం." అందరి కోసం మరింత సమగ్రమైన మరియు స్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడంలో వైకల్యాలున్న వ్యక్తులు పోషించే ముఖ్యమైన పాత్రను ఈ థీమ్ గుర్తిస్తుంది. ఇది వారి జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాత్మక ప్రక్రియలలో వైకల్యాలున్న వ్యక్తుల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది.   

ఈ సంవత్సరం థీమ్ ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ మరియు విధాన సందర్భాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రత్యేకించి భవిష్యత్తు కోసం ఒప్పందం మరియు సామాజిక అభివృద్ధి కోసం రాబోయే 2025 ప్రపంచ సదస్సు మరియు 2030 ఎజెండాను సాధించడానికి వేగాన్ని సృష్టించాల్సిన అవసరాన్ని ప్రతిబింబిస్తుంది. ఇతివృత్తం వికలాంగుల నాయకత్వ పాత్ర యొక్క కేంద్రీకరణను విస్తరించడానికి ప్రయత్నిస్తుంది.

వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై,1998 నుండి ప్రతి సంవత్సరం వికాలాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

ఊదా రంగు కూడా ఐక్యత మరియు సంఘీభావాన్ని తెలియజేస్తుంది, వికలాంగులకు మద్దతుగా కలిసి నిలబడటం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది.శామ్యూల్ అలెగ్జాండర్ కిర్క్  అమెరికన్ మనస్తత్వవేత్త మరియు విద్యావేత్త, అతను లెర్నింగ్ డిసేబిలిటీ అనే పదాన్ని రూపొందించడంలో ప్రసిద్ధి చెందాడు.

2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో దివ్యాంగులకు ప్రభుత్వ తోడ్పాటు ఎంతైనా అవసరం ఉందని చెప్పాలి. వారికి కూడా ఇతరుల వలే సమానావాకాశాలు కల్పించాలి. ముఖ్యంగా మెరుగైన జీవనానికి ఎంతో కీలకం అయిన విద్యా, ఉపాధి, ఆరోగ్యం, సంరక్షణ, సాంకేతికరంగాల్లో వారికి అవకాశాలు ఉండాలి. తద్వారా దివ్యాంగుల సాధికారతకు శ్రీకారం చుట్టాలి.అదే విధంగా వారిని అవమానించకూడదు.

Post a Comment

0 Comments