GET MORE DETAILS

తల్లి తండ్రుల గురించి ధర్మ శాస్త్రం ఏమి చెబుతుంది.

తల్లి తండ్రుల గురించి ధర్మ శాస్త్రం ఏమి చెబుతుంది.



(1) ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.

(2) ఆకాశము కన్నా ఉన్నతుడు. తండ్రి.

(3) ఒక్కసారి తల్లికి, తండ్రికి సమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.

(4) సత్యం తల్లి - జ్ఞానం తండ్రి.

(5) పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి.

(6) తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.

(7) ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం.

(8) ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.

(9) తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది.

(10) తల్లిని మించిన దైవం లేదు ? గాయత్రిని మించిన మంత్రం లేదు. శుభంసర్వే జానాః స్పూఖినో భవంతుసమస్త సన్మంగళాని భవంతు.

Post a Comment

0 Comments