రథసప్తమి విశిష్టతలేంటి? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు?
ప్రతి ఏటా మాఘ మాసంలో శుక్ల పక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రథ సప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు.
50 ఏళ్ల తర్వాత మూడు గ్రహాల అరుదైన కలయిక... ఈ రాశులకు కనకవర్షం ఖాయం..!ఏడు గుర్రాలు ఎందుకంటే... సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు. ఈ ఏడు గుర్రాలను వేదఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథం.
0 Comments