అక్టోబర్ 23 నుంచి ఆరు రోజుల పాటు ఈ రాశులకు అదృష్టమే, చంద్రుని రాశి మార్పుతో డబ్బు, గృహ, వాహన యోగాలతో పాటు ఎన్నో...!
చంద్రుని సంచారంలో మార్పులు కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా కలిసి వస్తున్నాయి. వారిపై ఈ సంచారం ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆశించిన ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా ఉంది. గృహ, వాహన యోగాలు కూడా ఉన్నాయి. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. చంద్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర రోజులు సమయం పడుతుంది.చంద్రుడి రాశి మార్పు
ఈ నెల 23, 24, 25 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత 26, 27, 28 తేదీలలో ధనుస్సు రాశిలో సంచారం చేస్తాడు. చంద్రుడికి నీచరాశి వృశ్చిక రాశిలో సంచారం సమయంలో చంద్రుడిని గురువు వీక్షించడం వలన ఉచ్చబలం కలుగుతుంది. ధనుస్సు రాశిలో సంచారం చేసే చంద్రుడు గురువుతో పరివర్తన చెందుతాడు.
పరివర్తన యోగం
చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు, గురువుకు చెందిన ధనుస్సు రాశిలో చంద్ర సంచారం పరివర్తన యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇలా చంద్రుని సంచారంలో మార్పులు కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా కలిసి వస్తున్నాయి. వారిపై ఈ సంచారం ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆశించిన ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా ఉంది. గృహ, వాహన యోగాలు కూడా ఉన్నాయి. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
చంద్రుని సంచారంలో మార్పు ఈ రాశుల వారికి అనేక లాభాలు
1. మేష రాశి:
మేష రాశి వారికి ఈ ఆరు రోజులు పాటు అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తల్ని వింటారు. జీతం పెరిగే అవకాశం ఉంది. ఈ ఆరు రోజుల్లో మీరు చేసే ఏ పనైనా విజయం సాధిస్తుంది. గృహ, వాహన యోగాలు కూడా ఉన్నాయి.
2. వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ ఆరు రోజులు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. చంద్రుడిపై కుజ, గురువు దృష్టి పడడంతో మీ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
3. కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
4. తులా రాశి:
తులా రాశి వారికి చంద్రుని అనుగ్రహంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో అధికార యోగం కలుగుతుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా ఉంది. ఆదాయం, ఆరోగ్యం రెండూ బాగుంటాయి.

0 Comments