GET MORE DETAILS

పోగొట్టుకున్న ఫోన్ దొరుకుతుందిలా...!

పోగొట్టుకున్న ఫోన్ దొరుకుతుందిలా...!  


• సంచార్ సాధి యాప్ తో 6 లక్షల మొబైళ్ల రికవరీ

ఇప్పటివరకూ వినియోగదారులు పోగొట్టుకున్న 6 లక్షల మొబైల్ ఫోన్లను సంచార సాధీ యాప్/ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ 'యాప్లో ఉన్న 'బ్లాక్ యువర్ లాస్ట్/ స్టోలెన్ మొబైల్ హ్యాండ్సెట్ లో నమోదు చేసిన వివరాల ఆధారంగా టెలికాం శాఖ, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, పోలీసులు రియల్టైమ్లో ఆ ఫోన్ల వివరాలను సేకరించి రికవరీ చేసినట్లు పేర్కొంది. 'సంచార్నాథ్ యాప్ కారణంగా నెలనెలా రికవరీలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జన వరిలో 28,115 ఫోన్లు రికవరీ చేయగా ఆగస్టు నాటికి ఆ సంఖ్య 45,243కి చేరింది' అని కమ్యూనికేషన్ల శాఖ తెలిపింది. రికవరీల్లో గత 8 నెలల్లో 61% వృద్ధి నమోదైనట్లు వివరించింది. ఈ యాప్తో దర్యాప్త సంస్థల మధ్య సమన్వయం పెరగడమూ దీనికి దోహ దపడుతోంది.

2023 మేలో ప్రారంభమైన సంచార సాధీ యాప్ ను ఇప్పటివరకు 90 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.

పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ వివ రాలను యాప్లో నమోదు చేసిన వెంటనే దాన్ని ఎవ్వరూ దుర్వినియోగం చేయకుండా టెలికాం నెట్వ ర్క్లు వెంటనే బ్లాక్ చేస్తాయి

ఆ ఫోన్లోకి ఏదైనా సిమ్ వేస్తే... వెంటనే సంబం ధిత పోలీస్ స్టేషన్కు అలర్ట్ వెళ్తుంది. వినియోగదారుడు ఇచ్చిన ప్రత్యామ్నాయ నెంబర్ కూ ఆ వివరాలు వెళ్తాయి.

సంచార్ సాథీ యాప్ లో.. అనుమానిత కమ్యూని కేషన్ల గురించీ ఫిర్యాదు చేయవచ్చు. ఒక్కో వినియో గదారుడి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కనుక్కోవచ్చు. ఈఎంఈఐ నిజమైనదో కాదో కూడా తెలుసుకోవచ్చు.


⬇️ CLICK HERE TO INSTALL

Post a Comment

0 Comments