GET MORE DETAILS

ఇంటిని ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఎన్ని రకాలుగా మంచిదో తెలుసా...

ఇంటిని ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఎన్ని రకాలుగా మంచిదో తెలుసా...


ఇంటిని ప్రతిరోజూ శుభ్రపరచుకునే వారు ఎక్కువే. అయితే ఇంటిని శుభ్రపరిచే నీటిలో రసాయనాలని అధికంగా కలుపుతారు. కానీ ఉప్పును (Salt) కలిపి ఇంటికి శుభ్రపరచడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 

ఇంటిని క్లీన్ చేసుకునే పద్ధతి

భారతీయ కుటుంబాలకు ప్రతిరోజూ ఇల్లు శుభ్రం చేసుకోవడం, వాకిలి శుభ్రపరచుకోవడం, ముగ్గులు వేయడం వంటివి అలవాటు ఉంటాయి. అలా చేశాకే వారు ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారు. ముఖ్యంగా కొన్ని వారాల్లో మాత్రం కచ్చితంగా ఇంటిని శుభ్రపరచుకుంటారు. అలాంటప్పుడు బయట దొరికే రసాయనాలు కలిపిన లిక్విడ్ లను నీళ్లలో కలిపి ఇంటికి మాప్ పెడతారు. అలా పెట్టడం వల్ల బ్యాక్టీరియాలు, వైరస్‌లు మరణిస్తాయని అంటారు. అలాంటి లిక్విడ్లను వాడే బదులు ఉప్పుని నీటిలో కలిపి ఫ్లోర్ పై మాప్ పెట్టడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పురాతన ఆచారాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.ఉప్పును వాడడం

ఉప్పు మన వంటలో భాగం

కొన్ని శతాబ్దాలుగా ఉప్పును శుద్ధి చేసే లక్షణాలు ఉన్న వస్తువు గానే చూస్తున్నారు. కాబట్టి మీరు ఇంటిని శుభ్రపరచుకునేటప్పుడు ఉప్పును వినియోగించడం మర్చిపోవద్దు. బకెట్ నీళ్లలో గుప్పెడు ఉప్పు వేసి బాగా కలపండి. ఆ నీటితో ఇంటిని శుభ్రపరిచేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోనే ప్రతికూల శక్తులను ఆ ఉప్పు గ్రహిస్తుంది. అలాగే మీ చుట్టూ ఉన్న పరిసరాలను శుద్ధి చేస్తుంది. ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఉండేలా చేస్తుంది. ఇంట్లోని సభ్యులు సామరస్యంగా, ఆనందంగా ఉండేలా సహకరిస్తుంది.

ప్రతికూల శక్తులు పోయేలా

ముఖ్యంగా గురువారం పూట ఉప్పు కలిపిన నీటితో ఇంటికి మాప్ పెట్టడం మర్చిపోవద్దు. హిందూ సంప్రదాయాల ప్రకారం విష్ణువు, బృహస్పతిలకు గురువారం అంటే ఎంతో ఇష్టం. వారిద్దరే జ్ఞానం, ఆధ్యాత్మికత, శ్రేయస్సును అందిస్తారు. కాబట్టి గురువారం ఇంటిని శుభ్రపరచుకుంటే ఎంతో మంచిది. మీరు ఆ రోజున ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రపరచండి. ప్రతికూల శక్తిని బయటకు పంపించి అదృష్టాన్ని ఆహ్వానించిన వారు అవుతారు. మీ ఇంటికి అంతా శుభమే కలుగుతుంది. అలాగే దైవిక శక్తులను గౌరవించడానికి వారిని ఇంటికి ఆహ్వానించడానికి కూడా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం.

ఉప్పులోని గుణాలు

సైన్స్ పరంగా కూడా ఉప్పు ఆరోగ్యాన్ని శుభ్రతను అందించే పదార్థంగానే గుర్తింపు పొందింది. ఇది సహజ ప్యూరిఫయింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి సహజ క్లెన్సర్ గా పని చేస్తాయి. నీటిలో వేసి ఉప్పును కలిపినప్పుడు అవి క్రిములను బ్యాక్టీరియాలను, దోమలు, ఈగలు వంటి కీటకాలను తొలగించడానికి సహాయపడుతుంది. దీనివల్ల మీరు నివసించే ప్రదేశం శుభ్రపడుతుంది.

స్వచ్ఛతకు చిహ్నం

శారీరక పరిశుభ్రతకు ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఆధ్యాత్మిక పరిశుభ్రతకు కూడా ఇది అద్భుతమైనది. ప్రతికూల శక్తులను తటస్థీకరించి హానికరమైన శక్తులను ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఇది ఉత్తమంగా ఉంటుంది. అనేక సంస్కృతులలో ఉప్పును స్వచ్ఛతకు, శక్తికి, రక్షణకు సూచికగా భావిస్తారు. ఉప్పునీటితో ఇంటిని శుభ్రపరచడం అనేది ఒక ఆచారంగా మారిపోయింది. కాబట్టి వారానికి ఒకసారి అయినా ఉప్పునీటితో ఇంటిని శుభ్రపరిచేందుకు ప్రయత్నించండి. ఇది ఉత్తమమైన ఫలితాలను కచ్చితంగా ఇస్తుంది.

Post a Comment

0 Comments