GET MORE DETAILS

గృహంలో- వ్యాపార స్థలంలో దేవుని ఫోటోలు

 గృహంలో- వ్యాపార స్థలంలో దేవుని ఫోటోలు



లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి - 9494550355


సాధారణంగా ప్రతి గృహంలోనూ వ్యాపార స్థలాలయందు దేవుని యొక్క చిత్రపటాలు ఉంచుతుంటారు. ఏ దేవుని ఫోటోలు ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఏ దేవుని ఫోటోలు ఇంట్లో ఉండరాదు అనే విషయం పరిశీలన చేద్దాము. 

వ్యాపార స్థలంలో శివ కుటుంబం ఉన్న ఫోటో ఉంచితే మంచి పురోభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఉండాలి. వెంకటేశ్వర స్వామి మధ్యలో నిలుచుని ఉంటారు వారి చుట్టూ అష్టలక్ష్మి కొలువై ఉంటారు దీనిని అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో అంటారు.

కుబేరుడు నవనిధులకు అధిపతి అటువంటి కుబేరుడు లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో వ్యాపార స్థలంలో ఉండాలి. ఈ మూడు ఫోటోలు ఉంచడం వల్ల వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వ్యాపార స్థలానికి ముందు భాగంలో కను దిష్టి వినాయకుడు ఫోటో ఉంచండి. అదేవిధంగా  గృహంలో కూడా శివ పరివారం ఫోటో ఉండాలి. లక్ష్మీ నరసింహ స్వామి శాంతస్వరూపుడై లక్ష్మీదేవిని తన తొడ పై కూర్చుండు పెట్టుకొని ఉన్న ఫోటో కూడా ఉంచాలి. శ్రీరామ పట్టాభిషేకం ఫోటో మరియు సరస్వతీదేవి ఫోటో కూడా గృహంలో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంచాలి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఉండాలి వెంకటేశ్వర స్వామి ఫోటో మధ్యలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ ఫోటో పూజా మందిరంలో ఉంచాలి. 

అదేవిధంగా అయ్యప్ప స్వామి ఫోటో ఇంట్లో దీక్ష చేసే సమయంలో మాత్రమే ఉండాలి. దీక్ష పూర్తయి ఇరుముడి ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫోటోను ఏదైనా దేవాలయంలో ఉంచండి. గృహంలో కాళికా అమ్మవారి ఫోటో ఉండకూడదు శనైశ్చరుడు ఫోటో ఉండకూడదు. అదేవిధంగా ఉగ్ర స్వరూప దేవతలు ఫోటోలు కూడా ఇంట్లో అమర్చ రాదు. గృహంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉండవచ్చు అదేవిధంగా శివ కళ్యాణం ఫోటో కానీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో కానీ శ్రీరామ కళ్యాణం ఫోటో గాని ఉంచవచ్చు. 

రాధా కృష్ణులఫోటో ఇంట్లో ఉన్నప్పుడు దాంపత్య అనుకూలత ఉంటుంది. కృష్ణుడు అర్జునుడు రథం పై వెళుతున్నట్టుగా ఫోటో ఉంటే ఇంట్లో చాలా మంచిది. ఈ రథానికి గుర్రాలు ఉన్నప్పటికీ దోషమేమీ కాదు ఋగ్వేదంలో గుర్రాలు గురించి చాలా ఉన్నతంగా తెలియజేశారు హయగ్రీవుడి తల కూడా గుర్రము తల ఉంటుంది. అర్జునుడు కృష్ణుడు ఉన్న ఫోటో ఇంట్లో ఉంచినప్పుడు ఇంట్లో అనేక విజయాలు సాధిస్తారు. ఈ విధంగా ఇంట్లో ఉండవలసిన ఫోటోలు ఏర్పాటు చేసినప్పుడు ఆ గృహంలోని సభ్యులు అందరూ అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందగలుగుతారు.

Post a Comment

0 Comments