టూత్ బ్రష్ సురక్షితమా..?
ప్రతిరోజూ ఉదయాన్నే టూత్ బ్రష్ తో దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అయితే దంతధావనం కోసం ఉపయోగించే టూత్ బ్రష్ శుభ్రంగానే ఉందా? అన్నది. కూడా గమనించుకోవాలి.
టూత్ బ్రష్ ను ఉపయోగించిన ప్రతిసారీ పదార్థాలు, లాలాజలం, బ్యాక్టీరియాలు టూత్ బ్రష్ బ్రిసిల్స్లోకి చేరి పోతూ ఉంటాయి. కాబట్టి టూత బ్రష్ను తడిగానే వది లేస్తే, ఆ తేమ వాతారణంలో ఇకొలై, స్ట్రెప్టోకోకస్, స్టాఫ్ బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రి ములు, ఫంగస్ లు విస్తృతంగా వృద్ధి చెందుతాయి. అలాగే కొన్ని ఇళ్లలో బాత్రూమ్లోనే సింక్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు టాయ్లెట్ను ఫ్లష్ చేసిన ప్రతిసారీ, టాయి లెట్ ఫ్లూమ్ అనే కంటికి కని పించని బిందువులు గాల్లో కలుస్తూ ఉంటాయి. ఆరు అడుగుల దూరం వరకూ ప్రయాణించే ఈ బిందువుల్లో విసర్జక బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఇవి కూడా టూత్ బ్రష్లోకి చేరిపోయే అవకాశాలుంటాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. టూత్ బ్రష్ తడిగా ఉన్నా, మూసిన డబ్బాల్లో, అల్మరాల్లో ఉంటున్నా, వాటిలో మోల్డ్, ఈస్ట్ పెరిగే అవకాశాలుం టాయి. ఇవి అలర్జీలు, శ్వాస కోస సమస్యలు, నోటి ఇన్ఫెక్ష న్లకు దారి తీస్తాయి. కాబట్టి టూత్ బ్రష్ రంగు మారినా, దుర్వాసన వేస్తున్నా దాన్ని వెంటనే పారేయాలి. టూత్ బ్ర ష ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...
• కుటుంబ సభ్యులందరి టూత్ బ్రష్లనూ ఒకే డబ్బాలో ఉంచకూడదు. బ్రష్ల మధ్య కనీసం అంగుళం దూరమైనా పాటించాలి.
• వాడిన ప్రతిసారీ టూత్ బ్రష్ను శుభ్రంగా కడిగి, పూర్తిగా ఆరిపోయేలా చూసు కోవాలి.
• ప్రతి మూడు నెలలకూ టూత్ బ్రష్ మారుస్తూ ఉండాలి.
• ఫ్లష్ చేయడానికి ముందు టాయిలెట్ లిడ్ మూసేయాలి.
• యువి శానిటైజర్ను ఉపయోగించాలి లేదా అప్పు డప్పుడూ టూత్ బ్రష్ బ్రిసిల్స్ మౌత్ వాష్లో నానబెడుతూ ఉండాలి.

0 Comments