GET MORE DETAILS

2026: రాహు కేతువుల దయతో ఈ రాశుల వారికి రాజయోగం.

 2026: రాహు కేతువుల దయతో ఈ రాశుల వారికి రాజయోగం.



కొత్త ఏడాదిలో కెరీర్, సంపదలో ఊహించని మార్పులు. రాహు కేతు సంచారం వల్ల మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు ఆకస్మిక ధన లాభాలు, విదేశీ అవకాశాలు, ఉద్యోగ పురోగతి, ఆస్తి లాభాలు కలుగుతాయి. విష సర్పానికి తల, తోకలు, వక్ర గ్రహాలు, పాప గ్రహాలు అయిన రాహు కేతువులు కొత్త సంవత్సరంలో కుంభ, సింహ రాశుల్లో తమ సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. 

ఛాయా గ్రహాలని జ్యోతిషశాస్త్రంలో పేరున్న ఈ రాహు కేతు గ్రహాలు కొత్త ఏడాదిలో కొన్ని రాశులకు ఆకస్మిక ధన లాభాన్ని, ఆకస్మిక శుభ పరిణామాల్ని, విదేశీ అవకాశాల్ని కలిగించే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులను ఈ రెండు గ్రహాలు అనేక విధాలుగా ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడం జరుగుతుంది. ఈ గ్రహాలకు ఆలయాల్లో పరిహారాలు చేయించడంతో పాటు తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల తప్పకుండా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 

మేషం 

ఈ రాశికి లాభ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నందువల్ల ఏడాదంతా ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో తప్ప కుండా పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభాలతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదే వీల్లో బాగా లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

వృషభం   

ఈ రాశికి దశమ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో కేతువు సంచారం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. అత్యంత ప్రముఖులతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవు తాయి.

సింహం   

ఈ రాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలను విస్తరించడం, సరికొత్త భాగస్వాములను కలుపుకోవడం వంటివి జరుగుతాయి. లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. విదేశీ అవకాశాలు అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఉద్యోగాల్లో ఉన్నవారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.

తుల 

ఈ రాశికి పంచమ స్థానంలో రాహువు, లాభ స్థానంలో కేతువు సంచారం వల్ల అనేక వైపుల నుంచి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విపరీతంగా లాభిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపుగా శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. కుటుంబంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ధనుస్సు 

ఈ రాశికి తృతీయ స్థానంలో రాహువు, భాగ్య స్థానంలో కేతువు సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజపూజ్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా పెరిగి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి.

కుంభం 

ఈ రాశిలో రాహువు, సప్తమంలో కేతువు సంచారం వల్ల వ్యక్తిగత జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విపరీతంగా లాభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై భూలాభం, ఆస్తి లాభం కలుగుతాయి.

Post a Comment

0 Comments