GET MORE DETAILS

అతినిద్ర హానికరం. గుండె జబ్బులు, డయాబెటిస్ పెరిగే చాన్స్!

 అతినిద్ర హానికరం. గుండె జబ్బులు, డయాబెటిస్ పెరిగే చాన్స్!



పరిమితికి మించిన పనులేవైనా దాదాపు ప్రతికూల ఫలితాలనే ఇస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. సరిగ్గా నిద్ర విషయంలోనూ అదే జరుగుతుందని 'సైన్స్ డైరెక్టర్ లో పబ్లిషైన అధ్యయన వివరాలు పేర్కొంటున్నాయి. నిద్రలేమి మాదిరిగానే.. అతి నిద్ర కూడా ఆరోగ్యానికి హానికరమని ఇది హృదయ సంబంధ వ్యాధులకు, డయాబెటిస్ కు కారణం అవుతుందని స్పష్టం చేస్తున్నాయి.

సాధారణంగా ప్రతి ఒక్కరికీ 7 నుంచి 8. గంటల నిద్ర అవసరం. కానీ అంతకంటే ఎక్కువగా.. ప్రతిరోజూ 9 గంటలకు మించి పడు కోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూప తందని అధ్యయనాలను విశ్లేషించిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. అతి నిద్ర శరీరంలోని వివిధ ప్రక్రియలను మందగిం చేలా చేస్తుంది. ముఖ్యంగా హృదయం తక్కువ సామర్థ్యంతో పని చేస్తుంది. బ్రెయిన్ యాక్టివిటీస్ నెమ్మదిస్తాయి. మెటబాలిక్ వ్యర్థాలు సక్రమంగా తొలగించబడకపోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా అధిక నిద్ర డయా బెటిస్, గుండె జబ్బులు, ఒబేసిటీ, డిప్రెషన్, తలనొప్పి, ఎర్లీ డెత్ రిస్క్ వంటి ప్రమాదాలను పెంచుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

గుండెపై ప్రభావం

అతి నిద్ర-అంటే 9 గంటలకు మించి నిద్రపోవడం హార్ట్ వీక్ నెస్కు దారితీస్తుంది. ఎక్కువసేపు పడుకొని ఉండటం వల్ల రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. హృదయ కండరాలు తక్కువగా పని చేస్తాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 38-50% పెరుగుతుంది.

డయాబెటిస్ రిస్క్

అతినిద్ర ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ దెబ్బతింటుంది. టైప్-2 డయాబెటిస్ రిస్క్ 50% వరకు పెరుగుతుంది. బరువు అదుపు తప్పుతుంది. అంటే ఊబకాయం సమస్యకు దారితీస్తుంది. అంతేకాకుండా అతినిద్ర వల్ల శరీరం ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ హార్మోన్ ను ఎక్కువగా విడుదల చేస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో 20-30% ఒబేసిటీరిస్క్ పెరుగుతుంది.

మెదడు మందగిస్తుంది

ఎక్కువసేపు నిద్రలోనే ఉండటంవల్ల మెదడులో మెటబాలిక్ వ్యర్థాలు సరిగ్గా క్లియర్ కావు. దీంతో పనితీరు మందగిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అల్జీమర్స్ & డిమెన్షియా, యాంగ్జెటీ, డిప్రెషన్ రిస్క్ పెరుగుతాయి. స్లీప్-వేకప్ సైకిల్ దెబ్బతి నడం వల్ల సెరటోనిన్, డోపమైన్ హార్మోన్లు అసమ తుల్యం అవుతాయి. ఈ పరిస్థితి డిప్రెషన్ రిస్క్ ను 2 రెట్లు అధికంగా పెంచుతుంది.

ఇమ్యూనిటీ వీక్

ఎక్కువ సేపు నిద్రలో ఉండటం కారణంగా ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ (CRP, IL-6) పేరు గుతాయి. రోగ నిరోధక శక్తి బలహీన పడుతుంది. దీంతో దీర్ఘకాలిక వాపు, ఇన్ఫెక్షన్లు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు సులభంగా దానిచేస్తాయి.

తలనొప్పి & మైగ్రేన్

ఎక్కువసేపు ఒకే స్థానంలో పడుకోవడం వల్ల సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్, టెన్షన్ హెడేక్స్, వర్టిగో వంటి సమస్యలకు దారితీయవచ్చు. అనేక మెటా-అనాలిసిస్ (1.5 మిలియన్ మంది డేటా) ప్రకారం... 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయే అలవాటు మొత్తం డెత్ రిస్క్ ను 30-45% పెంచుతుంది.

హార్మోన్ల అసమతుల్యం

అతి నిద్రవల్ల ఆకలి తగ్గించే హార్మోన్ అయిన లెప్టిన్ తగ్గుతుంది. దీంతో ఆకలిని పెంచే గెలిస్ హార్మోన్ పెరుగుతుంది. దీంతో ఎక్కువ తినాలని పిస్తుంది. క్రమంగా ఇది అధిక బరువుకు దారితీ స్తుంది. అంతేకాకుండా ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల కండరాలు, ఎముకలు బలహీనప డతాయి. కాబట్టి 7-8 గంటల నిద్రే శ్రేయస్కరం. అది 9 గంటలు దాటితే శరీరం 'స్లో మోడ్'లోకి వెళ్లి పైన పేర్కొన్న సమస్యలన్నీ దాడిచేస్తాయి.

Post a Comment

0 Comments