GET MORE DETAILS

కండ్లలో మసక ? మీరు తప్పక తినాల్సిన ఆహారాలివే !

 కండ్లలో మసక ? మీరు తప్పక తినాల్సిన ఆహారాలివే !



కళ్లు తరచుగా మసక బారుతున్నాయా? అయితే ఆది పోషకాహార లోపం వల్ల కూడా కావచ్చు. అంటున్నారు నిపుణులు. ఎందుకంటే తీసుకునే ఆహారం ద్వారా లభించే ఖనిజాలు, విటమిన్లు కంటి చూపును సహజమైన మార్గాలలో మెరుగు పరుస్తుంటాయి. దీర్ఘకాలంపాటు ఇవి అందకపోతే చూపు మందగించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు కూడా ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

క్యారెట్లు కంటి ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారంగా నిపుణులు పేర్కొంటారు. వీటిలో కంటి ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఎ. బీటా-కెరోటిన్లో సమృద్ధిగా ఉంటాయి. బీటా-కెరోటిన్ అనేది శరీరంలో విటమిన్ ఎగా మార్, రెటినాలోని రోడోప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తికి సహాయపడు తుంది. తక్కువ వెలుతురులో కూడా చూడడానికి ఇది చాలా అవసరం. అంతేకాకుండా క్యారెట్లు కంటి పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రాత్రిపూట సరిగ్గా కనబడకపోవడం వంటి సమస్యలను దూరం చేస్తాయి. క్యారెట్లను పచ్చిగా కానీ, ఉడికించి కానీ తినవచ్చు. సలాడ్లలో చేర్చి తినవచ్చ ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు మొత్తం ఆరోగ్యా నికి కూడా ఉపయోగపడుతుంది.

ఆకు కూరలు

పాలకూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగా యల్లో సహజంగానే లుటీస్ అండ్ జీయాక్సాన్స్టీన్ అనే యాంటి ఆక్సిడెంట్లను ఉంటాయి. ఇవి కంటి రెటీనాను హానికరమైన బ్లూ లైటింగ్ నుంచి, అతినీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి, ఈ యాంటీ అక్సిడెంట్లు ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ (AMD), అండ్ కంటిశుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆకుపచ్చ కూరగాయంలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది కంటి రక్తనాళాలను బలోపేతం చేస్తుంది. ఈ కూరగాయలను స్మూతీలు, సలాడ్లు లేదా తేలికగా వండిన వంటకాలలో చేర్చడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సాల్మన్ చేప

సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి ఆరో గ్యానికి అత్యంత ఉపయోగకరం. అంతేకాకుండా రెటినా పనితీరును మెరుగుపరుస్తాయి. కండ్లల్లో నీరు కారడం, పొడిబారడం వంటి సమస్యల నివారణలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా కంటి రక్తనా కాలను ఆరోగ్యంగా ఉంచడంలో, వాపును తగ్గించ డంలో కూడా సహాయపడతాయి. సాల్మన్ చేపలను గ్రిల్ చేసి, టేక్ చేసి, లేదా సూప్లలో చేర్చి తినవచ్చు. ఇతర ఒమేగా-3 సమృద్ధిగా ఉండే ఇతర చేపలలో ట్యూనా అండ్ సార్జిన్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా కంటి చూపును మెరుగు పరుస్తాయి.

ಗುಡ್ಡು

గుడ్లు, ముఖ్యంగా గుడ్డు సొన కంటి ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం, ఇందులో లుటీన్, జీయాక్సాన్స్ అంద్ జింక్ ఉంటాయి. ఇవి కంటిశుక్లం, రెటినా సంబంధిత సమస్యలను నివారిం చడంలో సహాయపడతాయి. గుడ్డులోని విటమిన్ ఎ కంటి ఉపరితలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కార్నియా రక్షణలో కీ రోల్ పోషిస్తుంది. గుడ్డును ఉడ కబెట్టి, ఆమ్లెట్, లేదా సలాడ్లలో చేర్చి తినవచ్చు. రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అంటారు పోషకాహార నిపుణులు,

బాదం

బాదంలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది. విటమిన్ ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ రిస్క్ ను తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బాదంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ అక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కంటి రక్తనాళాలను బలోపేతం చేస్తాయి. అప్పుడప్పుడు లేదా రోజుకు ఒకటి చొప్పున బాదం స్నాక్ గా తీసుకున్నా లేదా సలామ్లలో చేర్చి తినడం వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వంటి సమస్యలు నివారించబడతాయి

Post a Comment

0 Comments