GET MORE DETAILS

ప్రెగ్నెన్సీలో చేపలు తింటే తెలివైన పిల్లలు పుడతారా ?

 ప్రెగ్నెన్సీలో చేపలు తింటే తెలివైన పిల్లలు పుడతారా ?



గర్భధారణ సమయంలో చేపలు తింటే తెలివైన పిల్లలు పుడతారని పెద్దలు చెబుతుం టారు. అధ్యయనాలు సైతం ఇది నిజమేనని అంటున్నాయి. చేపలు తినడం వల్ల మేధస్సు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ మెరుగుపడుతుందని పేర్కొంటున్నాయి. డానిష్ నేషన్ బెర్త్ కోహార్ట్ అధ్యయనం (1997-2002)లో భాగంగా 25,446 మంది పిల్లలపై చేసిన పరిశోధనలోనూ ఇది వెల్లడైంది. 

అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల ప్రకారం రోజుకు సగటున 60 గ్రాముల చేపలను ఆహారంగా తీసుకున్న గర్భిణులకు జన్మించిన పిల్లలు సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో, వేగంగా కాళ్లు చేతులు కదిలించడం, తలను పట్టుకోవడం వంటి మోటార్ స్కిల్స్ను, అలాగే శబ్దాలకు వెంటనే స్పందించడం, పదాలు ఉపయోగించడం వంటి కాగ్నిటివ్ స్కిల్స్ ను ప్రద ర్శించారు. చేపలు తిననివారితో లేదా తక్కువ చేపలు తిన్నగర్భిణులతో పోలిస్తే ఈ నైపుణ్యాలు 25-30% మెరుగైన స్కోర్లు సాధించాయి.

జపాన్ ఎన్విరాన్ మెంట్ అండ్ చిల్డ్రన్స్ స్టడీ (JECS) లో భాగంగా 2024లో 91,909 మంది మదర్ చైల్డ్ జంటలపై చేసిన అధ్యయనంలో కూడా అధిక చేపలు తిన్న తల్లులకు పుట్టిన పిల్లలు 3 సంవత్సరాల వయసులో ఫైన్ మోటర్, ప్రాబ్లమ్-సాల్వింగ్, అలాగే పర్సనల్-సోషల్ స్కిల్స్ మెరుగుదల అధికంగా నమోదైంది. పైగా న్యూరోడెవలప్ మెంటల్ డిలేస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇదంతా ఎందుకు జరుగు తుందంటే చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (DHA, EPA), అయోడిన్ అండ్ హై-క్వాలిటీ ప్రొటీన్వంటివి గర్భంలోని పిండం, మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. 

బ్రెయిన్ ఫంక్షన్, మెమొరీ అండ్ లెరింగ్ను బలపరుస్తాయి అంటు న్నారు పరిశోధకులు. కేవలం చేపలు తినడం ఒక్కటే ఇక్కడ ప్రాధాన్యత కాదని, చేపల్లోని పోషకాలు అందుకు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. గర్భధారణ సమయంలో పోషకాహారం తోపాటు జన్యువులు, పర్యావరణం, తల్లి ఆరోగ్యం వంటి అనేక ఫ్యాక్టర్లు కూడా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, తెలివితేటలను ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.

Post a Comment

0 Comments