పాన్.. రద్దు కానీయొద్దు
మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్ అనుసంధానం చేసుకు న్నారా? డిసెంబరు 31లోపు ఈ పనిని పూర్తి చేయండి. లేకపోతే మీ పాన్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది.
ఆర్థిక లావాదేవీల్లో పాన్ కీలకం. ఈ నేపథ్యంలో నకిలీ పాన్లను నిరోధిం చేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆధార్ అనుసం దానం చేయడం తప్పనిసరి చేసింది. ఎప్పుడో తీసుకున్న పాన్, లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ద్వారా పాన్ తీసుకున్న వారు తప్పనిసరిగా డిసెం బరు 31లోగా పాన్-ఆధార్ అనుసం దానం చేసుకోవాల్సిందే.
ఏం అవుతుంది?
నిర్ణీత గడువులోగా ఈ రెండింటినీ అను సంధానం చేయకపోతే జనవరి 1, 2026 నుంచి మీ పాన్ కార్డు రద్దవుతుంది. దీని వల్ల అనేక ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతాయి.
• ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయలేరు.
• మీకు రావాల్సిన పన్ను రిఫండ్లు నిలి చిపోతాయి.
• బ్యాంకు లావాదేవీలు, మ్యూచువల్ పండ్లు తదితర పెట్టుబడులపై అధిక టీడీ ఎస్ (మూలం వద్ద పన్ను కోత) విధిస్తారు.
• రూ.50,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు చేయడం కష్టమవుతుంది.
• డీమ్యాట్ ఖాతాను ప్రారంభించేందుకు కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) ప్రక్రియను పూర్తి చేయలేరు.
• రుణాలు తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి.
ఏం చేయాలి?
• ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ను సందర్శించి 'లింక్ ఆధార్ ఆప్షన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయండి.
• ఒకవేళ ఇప్పటికే మీరు ఆధార్-పాన్ అనుసంధానం చేసి ఉంటే, 'పాన్ ఆధార్ లింక్ స్టేటస్' ద్వారా తెలుసుకోవచ్చు.
• ఇప్పుడు ఆధార్-పాన్ అనుసంధానం కోసం రూ.1,000 రుసుముగా చెల్లించాల్సి వస్తుంది. చివరి నిమిషం వరకూ వేచి చూడకుండా, ఇప్పుడే ఈ పని పూర్తి చేయండి. పాను రద్దు కాకుండా చూసుకోండి.
.jpeg)
0 Comments