సిమ్ కార్డులు - సైబర్ మోసాలు. అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవంటున్న నిపుణులు
సైబర్ మోసగాళ్లు రోజుకోరకంగా ప్రజలను మోసం చేసి డబ్బులు దండుకుంటు న్నారు. కొందరైతే సిమ్ కార్డులతోనే మోసాలకు పాల్పడుతున్నారు. ఒక వ్యక్తికి తెలియకుండా.. అతని పేరుతో సిమ్ కార్డులు సృష్టించి, దోచేస్తు న్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తి పేరుపై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకోవ డానికి 'సంచార్ సాథీ అనే యాప్ను తీసుకొ చ్చింది. దీని ద్వారా ఈ తరహా మోసాలకు అడ్డు కట్ట వేయవచ్చు.
ఇలా తెలుసుకోవచ్చు: ప్రభుత్వం తీసుకొ చ్చిన యాప్ గూగుల్ ప్లేస్టోర్, ఐవోఎస్ అందుబాటులో ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని, భాషను ఎంపిక చేసుకోవాలి. ఓటీపీని నమోదు చేయాలి. ఇక్కడ వివిధ ఆప్షన్లు వస్తాయి. దీనిలో ఫ్రాడ్ కమ్యూనికేషన్, నో నంబర్ ఆఫ్ మొబైల్ కనెక్షన్ వంటి పలు రకాల ఆప్షన్లు కని పిస్తాయి. దీనిలో నో నంబర్ ఆఫ్ మొబైల్ కనె క్షన్ ఎంపిక చేసుకుంటే మన నంబరుపై ఎన్ని సీమ్లు ఉన్నాయనేది తెలుస్తుంది.
అలాగే...
https://tafcop.sancharsathi.gov.in
వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్ సైట్లో కి వెళ్లగానే సిటిజన్ సెంట్రిక్ సేవలకు సంబం ధించిన ఆప్షను పై క్లిక్ చేయాలి. దీనిలోని 'నో మొబైల్ కనెక్షన్ ఇన్ యువర్ నేమ్' పై క్లిక్ చేయాలి. అనంతరం పది అంకెల సెల్ఫోన్ నంబరు దిగువ క్యాప్చా నమోదుతో పాటు సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తోంది. ఆపై ఆ వ్యక్తి పేరుపై ఉన్న సిమ్ కార్డుల నంబర్లు కనిపి స్తాయి. అందులో నంబర్లు ఎంపిక చేస్తే నాట్ మై నంబర్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్ అనే ఎంపికలు కనిపిస్తాయి. వీటిల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని నంబరుపై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఇంకా అనుమానం ఉంటే ఆ సర్వీసు ప్రొవైడర్కు ఫిర్యాదు చేయవచ్చు.
అప్రమత్తంగా ఉండాలి: సిమ్ కార్డు కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడంటే అక్కడ కొనకపోవడమే మంచిది. కొన్నిసార్లు సిమ్ తీసుకునే సమయంలో బయోమెట్రిక్ సరిగా పడలేదని మరోసారి వేయిస్తారు. దీనివల్ల రెండు సిమ్లు మన పేరుతో ఉంటాయి. కానీ మనం ఒకటి మాత్రమే తీసుకుంటాం. మరొకటి ఇతరులకు వారే విక్రయిస్తారు. అలా తీసుకున్న వ్యక్తి సక్రమంగా వినియోగిస్తే ఇబ్బందులు ఉండవు. అదే సైబర్ నేరగాళ్ల చేతికి అందితే వారు మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన డీలర్ల వద్ద సిమ్లు కొనుగోలు చేయాలి. ఈ తరహా కేసులు ఇప్పటి వరకు మన పరిధిలో నమోదు కాలేదు.
.jpeg)
0 Comments