గ్రహాల అనుకూలతతో ఈ రాశులవారికి జీవితంలో ఊహించని మార్పులు. కోరికలన్నీ నిజమయ్యే అవకాశం.
కొన్ని రాశులకు గురు, రవి, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జూన్ లోపు వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఈ రాశుల వారు కొద్దిగా ప్రయత్నించినా ఈ నాలుగు గ్రహాలు బాగా తోడ్పడే అవకాశం ఉంది.
కొన్ని రాశులకు గురు, రవి, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జూన్ లోపు వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. మూడు నెలల పాటు, మేషం, వృషభం, సింహం, కన్య, తుల, మకర రాశుల వారు తమ ఆశలు, ఆశయాలు, కోరికలను చాలా వరకు నెరవేర్చుకుంటారు. ఈ రాశుల వారు కొద్దిగా ప్రయత్నించినా ఈ నాలుగు గ్రహాలు బాగా తోడ్పడే అవకాశం ఉంది. సమస్యలు, ఒత్తిళ్లు దూరమయ్యే సమయం బాగా దగ్గరపడింది. సూర్యుడిని ఆరాధించడం, విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించడం వల్ల వీరికి అన్ని విధాలా శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అనుకున్నవన్నీ, ఆశించినవన్నీ తప్పకుండా జరుగుతాయి.
మేషం ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. మరింత మంచి కంపెనీలోకి మారే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది.
వృషభం ఈ రాశివారికి ఆర్థికంగా స్థిరత్వం సంపాదించాలన్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించిన ధన లాభం కలుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయాలు సాధిస్తారు.
సింహం ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వంలో ఉన్నతస్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. కొద్ది ప్రయత్నంతో సరైన ఉద్యోగం లభించడం, అందులో స్థిరపడడం కూడా జరుగుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ప్రముఖులతో స్నేహాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కన్య వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందాలన్న ఈ రాశివారి కోరిక నెరవేరుతుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో డిమాండ్ బాగా వృద్ధి చెందుతుంది. వీటితో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు దాదాపు కనక వర్షం కురిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ సవ్యంగా సాగిపోతాయి. విదేశీ సంపాదనకు కూడా అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
తుల ఈ రాశివారి కోరిక మేరకు ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోగలుగుతారు. పిత్రార్జితం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొందరు బంధువులతో వివాదాలు సమసిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఊహించని రాజపూజ్యాలు కలుగుతాయి. విదేశీయానానికి మార్గం సుగమమవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
మకరం ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్న వీరి కోరిక తప్పకుండా సఫలం అవుతుంది. బాధ్యతలతో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. వాహన యోగం పడుతుంది. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమై మనశ్శాంతి కలుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తి లాభం కూడా కలుగుతుంది.
.jpeg)
0 Comments